మన గురువు ప్రకృతి (5);-డా.నీలం స్వాతి,చిన్న చెరుకూరు గ్రామం,నెల్లూరు.6302811961.
 జీవితంలో ఎవరికైనా నడక (నడత) రెండూ ముఖ్యం. నడిచేటప్పుడు ఎంత సున్నితంగా ఉండాలి. మనం చేసే పనులు  నడత  ఎదుట ఉన్న ఏ ఒక్కరికి హాని కలిగించేట్లుగా కానీ బాధ కలిగించేట్టుగా కానీ ఉండకూడదు  ఆడపిల్లలు ప్రత్యేకించి  ఎలా నడవాలి  సామాన్యంగా ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా కొంతమంది అడ్డదిడ్డంగా నడుస్తూ ఉంటారు  అలాకాకుండా  నెమలి ఎలా నడుస్తుంది  దాని పింఛాన్ని విప్పి అడుగులో అడుగు వేసుకుంటూ  నిదానంగా నడుస్తూ ఉంటే చూడడానికి ఎంత ఆనందంగా ఉంటుంది  ఆ పద్ధతిలో దానిని చూసిన తరువాత నైనా  ఆ విధానాన్ని అవలంబించు అని  ప్రతి స్త్రీకి ప్రకృతి చెప్పే విషయం అలా నడిచే అమ్మాయిని అందరూ అభినందిస్తారు కూడా ప్రత్యేకించినాట్యం చేసే స్త్రీలు  తప్పకుండా దానిని  గమనించాలి  మనిషి అంటేనే మనీష. మనీష అంటే జ్ఞానం కలిగిన వాడు  కానీ అది ఎప్పుడూ పని చేస్తూ ఉండదు  కనుక జ్ఞానాన్ని సముపర్జించాలి అంటే  హంసను జ్ఞాపకం చేసుకో  పాలలో నీటిని కలిపి దాని ముందు పెడితే  దానిలో ఉన్న పాలనే తాగుతుంది నీటిని వదిలి వేస్తుంది  నీటిని పాలను వేరు చేసే గుణం ఏమిటో దానికి తెలిసినట్లుగా మరి ఏ ప్రాణికి తెలియదు  చివరకు మనుషులకు కూడా  కనుక మానవులకు అది గురువు  పురుషుడు అంటేనే పౌరుషం కలిగినవాడు  ఎవరైనా ఏమీ అనకుండా  ఇతరులు ఎవరైనా  తనతో అంటే  తన పౌరుషాన్ని చూయించే వ్యక్తి  అవసరమైతే పోరాటానికి కూడా సిద్ధమయ్యేవాడు  దీనికి గుర్తుగా పొట్టేలుని  సృష్టించింది ప్రకృతి  దానిని చూస్తే పౌరుషం ఎలా ఉండాలో మనకు తెలుస్తుంది.
మనిషి సాహసం చేయడంలో  పులిని మరి పించాలి  విరోధి వర్గాన్ని మట్టు పెట్టడంలో  దానిని జ్ఞాపకం చేసుకోవాలి మనిషి  పరాక్రమం చూ యించవలసినప్పుడు  సింహం గర్జించినట్లుగా దాని పంజాతో  శత్రువును చీల్చి చెండాడినట్లుగా  ప్రవర్తించడం కోసం అది నీకు జ్ఞాపకం రావాలి  ఇన్ని చెప్పిన శాస్త్ర కారుడు చివరకు చీమను కూడా వదిలిపెట్టలేదు  శివాజ్ఞ లేనిదే చీమైనాకదలదు అని నానుడి  దానికున్న పరిజ్ఞానం  నిశిత దృష్టితో  పరిశీలించి  తాను జీవించడానికి కావలసిన  వస్తువు ఎక్కడ ఉన్నదో గమనించి  ఆ మార్గం కూడా తెలుసుకుని వెళ్లి దానిని సాధిస్తుంది  ఆ పట్టుదల పరిశీలన చీమను చూసి నేర్చుకో  అని ఉద్భోధించడం కోసం  ప్రకృతి ఈ ప్రతి జీవిని మనకు ప్రసాదించిన వరం  అని భావించాలి  అప్పుడే జీవితం  ఉన్నత ఉత్తమ మార్గంలో ప్రయాణం చేస్తుంది.


కామెంట్‌లు