మహీపాలునికి గూఢచారుల ద్వారా యువరాణి దొంగలు దాచిన నిధిని కనుక్కోవడానికి రహస్యంగా నల్లమల అడవుల్లోకి వెళ్ళిన విషయం తెలిసింది.
ఇప్పటికే ప్రజల్లో యువరాణి శక్తిసామర్థ్యాల పట్ల నమ్మకం పెరిగిపోతుంది.
సైనికులు గూడా ఆమెపట్ల గౌరవాన్ని చూపిస్తూ భయభక్తులతో ప్రవర్తిస్తున్నారు.
మొదట చులకనగా చూసిన శత్రురాజులు గూడా ఆమె వీరత్వాన్ని గ్రహించి తిరుగుబాటు చేయడానికి వెనుకంజ వేస్తున్నారు.
''ఇలాగే చూస్తూ వుంటే ఏకు మేకయినట్లు అతి త్వరలో సింహాసనంపైకి ఎక్కడం నిశ్చయం.
ఒకసారి పరిపాలనపై పట్టు సాధిస్తే ఆ తర్వాత ఆమెని దింపడం ఎవరి తరమూ కాదు.
కాబట్టి అడవిలోనుంచి యువరాణి బైటకు అడుగు పెట్టకముందే, ఆమెను అక్కడే అంతం చేయగలిగితే, దొంగలదాడిలో ఆమె చనిపోయిందని అందరినీ నమ్మించవచ్చు.
ఇక వారసులు ఎవరూ లేకపోవడంతో తప్పనిసరిగా తననే యువరాజుగా మహారాజు ప్రకటిస్తాడు'' అని ఉపాయం పన్నాడు.
వెంటనే మహీపాలుడు తనకు నమ్మస్తులైన మెరికల్లాంటి యాభైమంది సైనికులను రహస్యంగా పిలిపించాడు.
ఒక్కొక్కడు కండలు తిరిగి అరివీరభయంకరంగా వున్నారు.
''చూడండి. మీరు అడవిలోకి పోయి నల్లత్రాచు ముఠాసభ్యుల్లా వేషం వేసుకొని తిరిగి వస్తున్న యువరాణి లాస్య మీద మూకుమ్మడిగా దాడి చేయండి.
ఆమెను గనుక హతమారిస్తే మీరు తరతరాలు హాయిగా కాలు మీద కాలేసుకొని తిన్నా తరగనంత సంపద ఇస్తా. మంచి మంచి పదవుల్లో నియమిస్తా.
కానీ ఇదంతా మూడోకంటికి తెలియకుండా రహస్యంగా జరిగిపోవాలి. వెంటనే ఒక్కక్షణం గూడా ఆలస్యం చేయకుండా బైలుదేరండి'' అంటూ ఆజ్ఞాపించాడు.
ధనం, పదవి అత్యంత ప్రమాదకరమైనవి.
దుర్మార్గులైన ఆ సైనికులకు ఆ రెండూ ఆశ చూపగానే వాళ్ళు అత్యంత ఉత్సాహంతో దొంగల్లాగా రూపం మార్చుకొని పెద్ద పెద్ద ఆయుధాలతో అడవిలోకి అడుగుపెట్టారు.
*******
లాస్యకు ఇదంతా తెలియదు.
ఆమె ఉత్సాహంగా తన పదిమంది అనుచరులతో అడవిలో వస్తూ వుంది.
ఆ అడవి చాలా పెద్దది.
వాళ్ళు వచ్చేదారిలో ఒక నది వుంది.
దాని నీళ్ళు చాలా వేగంగా ప్రవహిస్తూ వుంటాయి.
ఆ నది అలాగే కొద్దిదూరం భూమి మీద ప్రవహించి, పక్కనే వున్న ఒక పెద్ద లోయలోకి దూకుతుంది.
ఆ లోయలో పడితే అంతే.
ప్రాణాలతో తిరిగి బైటపడిన వారు ఎవరూ లేరు.
ఆ లోయలోంచి బైటకు రావడం అసాధ్యం.
అందుకే లాస్య అనుచరులతో జాగ్రత్తగా నదిని దాటసాగింది.
కాళ్ళ క్రింద నీళ్ళు సరసరసర ప్రవహిస్తూ వున్నాయి. చిన్నచిన్న రాళ్ళు కొట్టుకొనిపోతున్నాయి.
అనుచరులంతా ఒకరి చేయి ఒకరు పట్టుకొని అడుగులో అడుగు వేసుకుంటూ నదిని దాటుతూ వున్నారు.
లాస్య తన ఆయుధాలను పక్కనే వున్న అనుచరునికి అందించి జాగ్రత్తగా నీళ్ళలోకి దిగింది. వాళ్ళ మనసంతా ఆ నదిని దాటడం మీదనే వుంది. చుట్టుపక్కల గమనించడం లేదు.
అంతలో...
వూహించని విధంగా...
మహీపాలుడు పంపిన సైనికులు వాళ్ళ మీద విరుచుకుపడ్డారు.
కన్ను మూసి తెరిచేంతలోగా లాస్య చుట్టూ వున్న పదిమంది అనుచరులూ వారి చేతిలో హతమయ్యారు.
యువరాణి ఒక్కతే ఒంటరిగా వాళ్ళ మధ్య వుంది.
తళతళా మెరుస్తోన్న కత్తులతో వాళ్ళు ఒక్కొక్క అడుగే ముందుకు వేస్తూ వున్నారు.
శత్రువులేమో యాభై మంది.
తాను ఒక్కతే.
అదీగాక చేతిలో ఆయుధం గూడా లేదు.
గుడ్డిగా ముందుకు వెళితే చావడం ఖాయం.
ఒక పదిమందిని చంపగలదేమో గానీ ఆ యాభైమందిని వుత్తచేతులతో మట్టుపెట్టడం అసాధ్యం.
బలం పనిచేయని చోట తెలివిని ప్రయోగించాలి.
వెనక్కి తిరిగి చూసింది.
కొద్దిదూరంలో లోయలోకి నీళ్ళు దుంకుతూ వున్నాయి.
లోపలికి పడితే మరలా బైటకు రావడం అసాధ్యం.
ముందు నుయ్యి వెనుక గొయ్యిలాగా వుంది పరిస్థితి.
కానీ ముందు వీళ్ళ చేతుల్లోంచి బైటపడాలి.
తరువాత లోయలోంచి ఎలా బైటకు రావాలో ఆలోచించవచ్చు అనుకొంది.
అంతే ...
వేగంగా వెనక్కి తిరిగి ఆ నదిలో పరుగెత్తడం మొదలుపెట్టింది.
సైనికులు ఆమె ఆలోచనను గమనించి చేతిలోని కత్తులు, బళ్ళాలు సరసరసర ఆమె వైపు వేగంగా విసిరారు.
ఒక బళ్ళెం వేగంగా ఆమె శరీరాన్ని చీల్చివేయడానికి...
గాలిని చీల్చుకుంటూ...
సర్రున దూసుకొని ఆమె వీపు వైపు రాసాగింది.
ఒక్కక్షణంలో అది యువరాణి వెన్నులో దిగబడేదే...
కానీ...
అదే సమయంలో...
యువరాణి లాస్య ఎగిరి లోయలోకి దుంకింది.
నీళ్ళతో బాటు జర్రున కిందికి దూసుకు పోయింది.
కింద ఒక పెద్ద లోతైన మడుగు వుంది.
అంత పైనుంచి వచ్చి దభీమని దానిలో పడింది.
మామూలు జనాలైతే భయంతో మధ్యలోనే గుండె ఆగి చచ్చిపోయేవాళ్ళు.
కానీ లాస్య చిన్నప్పటినుంచీ ఆపదలు ఎలా ఎదుర్కోవాలో ప్రత్యేక తర్ఫీదు పొందింది.
ఎటువంటి సమస్య వచ్చినా గుండెనిబ్బరంతో ఎదుర్కోవడం నేర్చుకుంది.
దానితో ఆమెకు ఆత్మవిశ్వాసం చెక్కుచెదరలేదు.
కింద పడేటప్పుడు ఒక్కసారిగా తలకిందులుగా చేతులు ముందుకు చాచి ఒళ్ళంతా నిటారుగా చేసి ఆ మడుగులో అడుగు వరకు దూసుకుపోయింది.
మరుక్షణమే చేపపిల్లలా సర్రున ఈదుకుంటూ పైకి వచ్చింది.
కనుచూపు మేరలో చుట్టూ నీళ్ళు. ఒడ్డు ఎక్కడా కనబడ్డం లేదు.
ఐనా నిరాశ చెందకుండా నెమ్మదిగా ప్రవాహ దిశలో ఈదుకుంటూ కొన్ని గంటలకు ఒడ్డుకు చేరింది.
ఈదీ ఈదీ అలసిపోయింది.
ఒక చెట్టు కింద చల్లని నీడలో కూర్చుంది.
కాసేపటికి అలసట వల్ల ఆమె కనులు మూతబడ్డాయి.
నిద్రలోకి జారుకుంది.
అప్పుడు ఆమెకు తెలియదు ఆ లోయలో తాను మరో ప్రమాదంలో చిక్కుకోబోతున్నట్లు. తెలిస్తే అలా హాయిగా ఆదమరచి నిదురబోయేది కాదు.
********

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి