బ్రహ్మ పదార్థం;-ఏ బి ఆనంద్,ఆకాశవాణి,విజయవాడ కేంద్రం.9492811322
 మానవుడు ఈ భూమి మీదకు వచ్చిన తరువాత అతనికి కొన్ని ధర్మాలు ఉన్నాయి. ముందు ఆకలి తీరడం కోసం సంపాదన, ఉండడానికి ఇల్లు లేకుంటే అద్దె ఇల్లు అయినా  ఉండాలి. జీవితంలో ముందు అన్నిటికన్నా ప్రకారణమైనది భార్య  పెళ్లి జరిగిన తర్వాత పిల్లలు  దానితో సంసార భారం పెరగడం  మరింత సంపాదన కోసం మరింత  కష్టపడడం. ఇది సాధారణంగా ప్రతి వ్యక్తి చేసే పని. రోజు ఒకే పని చేస్తున్న వారికి ఎవరికైనా దానిమీద ఆసక్తి తగ్గుతుంది  వేరే విషయాల గురించి ఆలోచించాలనిపిస్తోంది  ఈ లోపు ఎంతోమంది పరిచయం కావడం వాళ్ల ద్వారా కొన్ని మంచి విషయాలను వినడం  ఆ మంచిలో ప్రత్యేకించి ఆధ్యాత్మిక విషయాలకు సంబంధించిన  బ్రహ్మజ్ఞానం కోసం తపించడం. అసలు ఈ బ్రహ్మ ఎవరు ఎక్కడ నుంచి పుట్టాడు  ఇది పురాణాలలో సృష్టించిందా లేక నిజమా  మనిషి ఏదైనా ఒక కార్యాన్ని చేపట్టాలనుకున్నప్పుడు దాని పూర్వాపరాలను తెలుసుకొని  అది సాధ్యమా అసాధ్యమా అన్న విషయాన్ని కూడా ఆలోచించి ఆ తర్వాత ఆ పని చేయడానికి పూనుకోవాలి  ఇతను తెలుసుకోవాలనుకున్న అంశం బ్రహ్మ పదార్థాలు గురించి  అసలు ఆ బ్రహ్మ ఎవరు  ఆ బ్రహ్మ పదార్థంలో ఉన్న భాగాలు ఏమిటి  అది ఎలా ఏర్పడతాయి  అది మన కంటికి కనిపించేవా  మనసుకు కనిపించేవా  అనే విషయాలను అన్నిటిని  ఆధ్యాత్మిక విదుల ద్వారా  తెలుసుకోవాలి  ఆ తర్వాత తాను తపస్సు చేయడానికి పనికి వస్తానా లేదా  మనసును దానిపైనే లగ్నం చేయగలనా లేదా అన్న విషయాన్ని  ఆలోచించుకొని మరీ చేయాలి. తన అజ్ఞానం చేత  తిరుపతిలో వెంకటేశ్వరా స్వామి ఉన్నట్టుగా బ్రహ్మ ఏ ప్రాంతంలో ఉన్నాడు అని అన్వేషించడానికి బయలుదేరి  ఎక్కడ చూసినా వారి దేవాలయమే కనిపించకపోయేసరికి  నిరుత్సాహంతో తిరిగి వస్తాడు విషయం తెలిసిన పెద్దలు అతనికి జ్ఞానోపదేశం చేస్తే తప్ప  విషయం అర్థం కాదు  బ్రహ్మ పదార్థం అంటే అణువు  అణువు ద్వారానే మనిషి  ఆకారం ఏర్పడుతుంది  ఒక్క మనుష్యుడే కాకుండా ఈ భూమి మీద ఉన్న ప్రతి చరాచర వస్తువు అణు నిర్మితమే  దానిలో మూడు విభాగాలు ఉంటాయి  అవన్నీ తర్వాత తెలుసుకుందాం గాని  ముందు ఈ విషయాన్ని గురించి ఆలోచించు అని ఆశ్చర్యపోతారు  వారి మాటలు విన్న తర్వాత  తన భ్రమలు అని తొలగిపోతాయి  నిజమైన బ్రహ్మ పదార్థం ఏంటో తెలుస్తుంది అంటారు  వాడు రాసిన పద్యం చదివితే  వివరాలు తెలుస్తాయి.


"బ్రహ్మ మేడ దనుచు పాలు మారు నాడేరు వెర్రి మూర్ఖజనుల విధము జూడ  బ్రహ్మమన్నిటందు పరిపూర్ణమై ఉండు..."

.

కామెంట్‌లు