ఆత్మ పరమాత్మ బంధం;- ఏ.బి ఆనంద్,ఆకాశవాణి,విజయవాడ కేంద్రం,9492811322.
 ఏ మనిషి అయినా  తన దగ్గర బంధువులు  కానీ సన్నిహితులు కానీ కుటుంబ సభ్యులు కానీ మరణించినప్పుడు  అయ్యో చనిపోయాడు  అతను లేకుండా మేము బ్రతకడం ఎట్లా  కుటుంబాన్ని ఇబ్బంది పెట్టి మరీ పోయాడు  ఆయన బదులు నేను పోయినా బాగుండేది అని భార్య  దుఃఖిస్తూ ఉంటే మిగిలిన వారు వారిని ఓదారుస్తూ ఉండడం మనం సామాన్యంగా చూస్తూ ఉన్న విషయం. అదే సినీనటులలో మంచి పేరు ప్రఖ్యాతులు తెచ్చుకున్న వారు గాని  రాజకీయ నాయకుడు గాని, స్వాతంత్ర సమరయోధుడు కానీ ఎవరైనా సరే మరణించారు అన్న క్షణం  అయ్యో పాపం చనిపోయాడా  ఆయన కీర్తి  అజరామరమై  నిలిచింది కదా  అలాంటి వాడికి చావు రావటం ఏమిటి  అని వారిని గురించిన పూర్వపరాలను  గంటల తరబడి మాట్లాడుతుంటారు.  మాధ్యమాల్లో అయితే ఆ విషయాన్ని గురించి పదే పదే చెబుతూ ఉంటారు.
మరణించిన వారిలో ఎవరినైనా  విపరీతంగా ప్రేమించిన వాడు కానీ  నచ్చినవాడు కానీ ఉంటే  ఆ గ్రామంలో ఎక్కడో ఒకచోట  ఆయన శిలా విగ్రహాన్ని ప్రతిష్టించి  వారి గొప్పతనాన్ని గురించి అందరికీ తెలియజేసే కార్యక్రమాన్ని చేపడతారు  వారికి సంబంధం లేకుండా విపరీతమైన  ప్రేమాభిమానాలను పెంచుకున్న వ్యక్తులు పోయినప్పుడు  తనతో పాటు మరి కొంతమందిని సమీకరించుకొని  వారికి సంబంధించిన చరిత్ర మొత్తాన్ని పుస్తక రూపంలో తీసుకురావడానికి ప్రయత్నం చేసేవారు కొంతమంది ఉంటారు  వేమన వీరందరినీ గమనిస్తూ వారు చేసే పనులు అర్థరహితంగా ఉండడం  తనకు నచ్చక  విషయం తెలియకుండా వారు వారి ప్రేమను వ్యక్తం చేస్తున్నారు తప్ప  నిజంగా వీరు చేసే పనులు అవసరమా అని సమాజాన్ని ప్రశ్నిస్తున్నారు  స్వతహాగా వేమన అభ్యుదయ వాది కనుక  ఇలాంటి ఆలోచనలు వస్తాయి.
నిజానికి మరణానికి చావుకు  శరీరానికి  జీవానికి ఉన్న సంబంధం తెలిసిన ఏ ఒక్కరైనా  ఎంతగా అధికంగా ఆలోచించి  ఎలా చేస్తారో  ఏం చేసినా వారు నా దృష్టిలో వెర్రి వారు పిచ్చితనం నుంచి తోచిన పనులు  అంటాడు  మనిషి జీవితం  ఎలా ఉంటుంది అని ఆలోచిస్తే  మనిషి లోపల ఉన్న జీవి  పైన ఉన్న శరీరాన్ని నడిపిస్తూ ఉంటుంది  ఆ జీవి  పరమాత్మలో తప్ప మరెక్కడా కలవదు   దానికి మరణమే లేదు  మరణం లేని ఆ జీవి కోసం  వీరు ఎంత తతంగం చేస్తున్నారు అంటే  నాకు చాలా ఆశ్చర్యంగా ఉంటుంది  చనిపోయిన తను  ఎక్కువ రోజులు ఇంట్లో ఉంటే అది కుళ్లి దుర్వాసన వచ్చి  రోగ క్రిములకు ఆలయం అవుతుంది కనుక  ఆ శవాన్ని స్మశానానికి తీసుకెళ్లి దహనం చేసి కర్మ కాండము మొత్తం శాస్త్రీయంగా చేస్తారు.  ఇది ఆరోగ్యానికి సంబంధించిన విషయం మరి ఆ పద్యాన్ని చదవండి.

" చచ్చె చచ్చె ననుచు చావుకు వగచెడు  దీన నరుల వెర్రితెలుపరాదు 
ప్రాణమునకు మృత్యుబంధంబు లుండునా..."


కామెంట్‌లు
Popular posts
చిత్రాలు ; ..జ్యోతి టీచర్ వివేకానంద కాన్వెంట్ హైస్కూల్ భారత్ నగర్ (మూసాపేట)- హైదరాబాద్
చిత్రం
తల్లి గర్భము నుండి ధనము తేడెవ్వడు--ఎం బిందుమాధవి
చిత్రం
దగ్గు , ఆయాసం,పిల్లి కూతలు - నివారణ ------------------------------------------------------- పిల్లల్లో జలుబు, దగ్గు, ఎక్కువైనప్పుడు ఊపిరి తిత్తుల్లోని శ్వాస మార్గాలు ముడుచుకు పోయినప్పుడు శ్వాస వదులుతున్నప్పుడు శబ్దం వస్తే దాన్ని పిల్లి కూతలు అంటారు. దీనికి ఉబ్బసం కూడా ఒక కారణం కావచ్చు. వైరస్ బాక్టీరియా , కారణంగా శ్లేష్మపు పొరలు వాచిపోతాయి. దాని వల్ల గురక వస్తుంది కఫం వాలా జ్వరం కూడా రావచ్చు. చిటికెడు పిప్పళ్ల చూర్ణంలో తేనే వెచ్చని నీటిలో కలిపి తాగిస్తే కఫ జ్వరం తగ్గిపోతుంది పిప్పళ్ల పొడిని పాలతో కలిపి తాగిస్తే ఉబ్బసం తగ్గి పోతుంది. పిప్పళ్ల పొడితో బెల్లం కలిపి తినిపిస్తే దగ్గు, ఉబ్బసం తో పాటు రక్తహీనత కూడా నివారించ వచ్చు. - పి . కమలాకర్ రావు
చిత్రం
చిత్రాలు ; జి.జీవనజ్యోతి టీచర్ వివేకానంద కాన్వెంట్ హైస్కూల్ భరత్ నగర్ హైదరాబాద్
చిత్రం
తెలివితేటలు!! ప్రతాప్ కౌటిళ్యా
చిత్రం