దొంగ సాధువు;- ఏ.బి ఆనంద్,ఆకాశవాణి,విజయవాడ కేంద్రం,9492811322.
 ఎవరైనా ఒక దొంగ  అతని అవసరాలు తీర్చుకోవడం కోసం కానీ  జీవితాన్ని విలాసవంతంగా గడపడానికి కానీ  జీవితంలో తన ఆశలను  ఆశయాలను తీర్చుకోవడం కోసం కానీ దొంగతనాలు చేస్తూ ఉంటాడు. ఈ పని మంచిదా చెడ్డదా అన్న విషయం కూడా అతనికి పూర్తిగా తెలుసు. ఒకవేళ పట్టుబడితే జీవితమే నాశనం అవుతుందన్న  జ్ఞానం కూడా అతనికి ఉంది  కానీ పరిస్థితుల ప్రభావం వల్ల అలా చేస్తూ ఉంటాడు. ఆ చేసేటప్పుడు ఎంతో తెలివిగా ఎవరూ చూడకుండా తాను చేస్తున్న పనిని ఎవరు గమనించకుండా చేసే  నైపుణ్యాన్ని సంపాదించి  ఆ తరువాత దొంగతనానికి పూనుకుంటాడు తప్ప  మనకు తెలిసేలా  మన ఎదుటనే చేస్తే అది దొంగతనం ఎలా అవుతుంది. కనుక దాని పద్ధతులు దానికి ఉన్నాయి.
ఇది భౌతిక వస్తువులకు సంబంధించిన  విషయం మాత్రమే  కానీ కొంతమంది దొంగ గురువులు వచ్చి  మీకు మోక్షాన్ని ఇస్తాను ఆ పద్ధతి తెలియజేస్తాను  అని దొంగ పద్ధతులను నేర్పితే  నేర్చుకునే సాధకుడు  దానిని ఎప్పుడు గమనిస్తాడు.  దొంగ గురువు ప్రవర్తన వల్ల  అతని స్వార్థ చింతన వల్ల  తాను నేర్పే పద్ధతి వల్ల  దొరికిపోతాడు  ఇలాంటి పనులు చేయడం వల్ల  ఆ దొంగ సాధు శిక్షలు అనుభవించక తప్పదు  ఈ సాధకుడు  మోక్షాన్ని గురించిన ఆలోచన  విరమించక తప్పదు.  కనుక నిజమైన మోక్షాన్ని పొందాలి అంటే చేయవలసిన పని ఏమిటి  అది ఎవరి ద్వారా సాధ్యమవుతుంది మంచి గురువు ఎవరు ముందు వారిని ఎన్నిక చేసుకొని  వారి అంగీకారాన్ని పొంది  వారి శిక్షణ పొందినట్లయితే  అప్పుడు  తాను కోరుకున్న మోక్షం తనకు ప్రాప్తిస్తుంది.
చేతకాని పనులను చేపట్టి  తాను అప్రతిష్ట పాలు  కావలసిన వస్తుంది  ఈ చేతకాని పనుల వల్ల  అలవాటు లేని ఆపోసనం  అని పెద్దలు చెప్పే సూక్తి  నీకు శాస్త్రం తెలిసి  నీటిని  చేతిలో ఉంచి  విస్తరి చెట్టు  ఒక్కొక్క చుక్క పోసిన దగ్గర నుంచి కుడి నుంచి ఎడమకు, ఎడమ నుంచి కుడికి అని తెలియకుండా ఆ చేతిలో ఉన్న నీటిని ఎప్పుడు గుటక వేయాలో తెలియక  తికమక పడుతున్న వాడికి  సద్గురువు బోధ కావాలి తప్ప  వ్యాపార రీత్యా  ప్రవర్తించే దొంగ గురువు కాదు అని వేమన చెబుతున్న నీతి. అలా చేస్తున్న గురువు కాని  గురువులు  గుణహీనులు గా పరిగణించబడతారని వేమన మనకు తెలియజేస్తున్న  విషయం. దానిని వారు రాసిన ఆటవెలది పద్యంలో  ఒక్కసారి చదవండి మీకే అర్థమవుతుంది  తరువాత ఏ దొంగ గురువులు ఆశ్రయించవద్దు.

"దొంగ తెలివి చేత దొరుకునా మోక్షంబు  
చేతగాని పనులు చేయరాదు  గురుడనంగ వలదు గుణ హీనుడనవలె..."



కామెంట్‌లు