అమరావతిని పాలించే రాజుగారు తనమంత్రి తోకలసి, బాటసారుల్లా మారువేషాలు ధరించి గుర్రాలపై పర్యటనకు బయలుదేరారు. అలా పలుగ్రామలలో పర్యటిస్తూ వేజండ్ల అనే గ్రామంచేరి అక్కడి పూటకూళ్ళా ఇంట భోజనం ముగించి ఎదురుగా ఉన్న రచ్చబండపై వేపచెట్టునీడన విశ్రమించారు మారువేషాలలోని రాజు,మంత్రి.
వీరినిచూస్తూనే అక్కడ తాంబూలం సేవిస్తూ కూర్చున్న ఇరువురు పండితుల్లో ఒకరు "ఏమయ్య బాటసారులు ఎలాఉంది మాఊరి భోజనం "అన్నాడు ."అయ్య ముద్దపప్పు,ఆవకాయ,చారెడు కమ్మని నేయి, తోపాటుగా పప్పుచారు,రసం,దప్పళాలకు కాస్తంత ఇంగువ తగిలించారేమో అమోఘం, పాయసం,పనస అప్పడాలు,మినపవడియాలు,గడ్డపెరుగు అందులో నంజుకోవడానికి దబ్బకాయ ఊరగాయ రుచి ఆహ రాజభోజ నాన్నిమరపించింది "అన్నాడుమంత్రి. "ఏమిటి రాజభోజనం మరిపించిందా నువ్వెప్పుడైనా రాజభోజనం తిన్నావా? అమాయకుడా రాజుగారి భోజనం లో గారెలు,బూరెలు,ఎన్నోరకాల పిండివంటలు,పంచభక్ష భక్ష్యాలు, భోజ్యాలు,లేహలు,చోష్యాలు, చిత్రాన్నాలు, తొమ్మిరకాల కాయకూరలు, పలురకాలదుంపకూరలు, నాలుగురకాల ఆకుకూరలు,ఫలరసాలు, మధురపానియాలు,సమస్త ఫలాలు వంటి ఎన్నోమనకు తెలియనివి వడ్డించబడతాయి. అయీనా మనరాజుగారికి ఏంపనిఉంటుంది కమ్మని వంటకాలు ఆరగించి విశ్రాంతి తీసుకోవడమేగా !"అన్నాడు ఓపండితుడు ."అవునోయి శర్మ జీవితంలో ఒక్కసారైనా రాజును ఆశీర్వదించి సంభావన అందుకుని రాజభోజనం చేయని జన్మవృధా"అన్నాడు రెండవపండితుడు.
వారిమాటలకు ఆశ్చర్యపోయిన రాజు,మంత్రి, ఆఇరువురి పండితుల వివారాలు తెలుసుకునా రాజధానికి బయలుదేరారు.
మరోరెండురోజుల్లో రాజుగారి పుట్టిన రోజుసందర్బంగా , రాజపురోహితులతో కలసి రాజుగారిని ఆశీర్వదించి, రాజుగారి భోజనంచేసి, సంభావన స్వీకరించవలసినదిగా ఆహ్వనిస్తు ఇరువురి పండితులకు పల్లకిపంపారు రాజుగారు.
రాజుగారిని పుట్టినరోజున ఆశీర్వదించి,భోజనశాలలో ప్రవేసించి తమకు చూపించిన పీటలపై కూర్చున్నారు పండితులు. అరటి ఆకులు వేసి, మంచినీళ్ళు పెట్టారు ఇరువురి పండితుల ముందు.
ఇంతలో కొందరు భటులు భోజనశాలలో అటు ఇటు వెదుకుతూ కనిపించారు."ఏమిటి నాయనా వెదుకుతున్నారు ?"అన్నాడు ఓపండితుడు. "అయ్య ఎవడో శత్రువులమనిషి భోజనశాలలో ప్రవేసించి రాజభోజనంలో విషంకలిపాడట" అన్నాడు భటుడు. ఆమాటవింటూనే పండితులు ప్రాణభయంతో పీటలపైనుండిలేచివెళ్ళి, రాజదర్శనంచేసుకుని "జయమగుగాక ప్రభులకు"అని చేతులు జోడించారు. "పండితులారా భోజనం ముగిసిందా?" అన్నాడు మంత్రి. "మంత్రి వర్య భోజనం వద్దులెండి సంభావనఇప్పిస్తే..."అన్నారు పండితులు. "పండితులారా రాజుగారి భోజనంలో విషంకలసింది అనగానే భయపడిపోయిరా! చెప్పుడుమాటలు ఎంతప్రమాదకరమైనవో తెలుసు కున్నారుగా? పలురాచకార్యాలతో నిరంతరం సతమతమౌతూ,నిత్యం పలువురు శత్రువుల వ్యూహలను సమర్ధవంతంగా ఎదుర్కొంటూ, అనునిత్యం ప్రజల సంక్షేమం కొరకు, పలువినూత్నపధకాలు ప్రవేశపెడుతూ, రేయింబవళ్ళు ప్రజలఅవసరాల కొరకు శ్రమిస్తూ మానసిక వత్తిడికిలోనై భోజనం చేసే సమయంకూడా లేకుండా పనులవత్తిడిలో రాజుగారు గిన్నెడు పాలతో గడిపిన రోజులు ఎన్నో, ప్రతి పౌరునికి ఈసమాజంపట్ల బాధ్యత ఉంటుంది. ప్రతివారికి వారిస్ధాయికితగిన పనుల వత్తిడి వారికిఉంటుంది.ఉన్నతస్ధాయి పాలకులు,ఉద్యోగులు సుఖఃగా ఉంటారని, చిన్నఉద్యోగులు ,సామాన్య ప్రజలు కష్టపడతారు అనుకోవడం పొరపాటు.కొందరికి పనివత్తిడిలో భోజనం చేసే సమయంకూడా లభించదు.వృత్తినే దైవంగా భావించే మహనీయులుఎందరో ,భయపడకుండా పదండి మనతోపాటు రాజుగారు భోజనం చేస్తారు "అన్నాడు మంత్రి. సంతోషంగా మంత్రిగారిని అనుసరించారు పండితులు.
.

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి