స్వప్నానుభవాలు... !- కోరాడ నరసింహా రావు.

 స్వప్నంలో... ఎన్నెన్ని చిత్ర,
 విచిత్రానుభవాలు !
 ఎన్నడూ  కనీ, వినీ ఎరుగనిఅద్భుతాలు దర్శనమిస్తాయి... ! 
     కలలు -కల్లలంటారు !
  గానీ.... ఆ కంటున్నా కల ఎన్నెన్ని అనుభూతులనుకలిగిస్తుంది !
ఎంత ఆనందాన్ని కలిగిస్తుంది !! ఎన్నెన్ని భయాలతో చంపేస్తుంది... !!!
        కలలు  ఊరికే వస్తాయా... 
తీరని మన కోరికలు, ఆశలు, ఆశయాలు, ఆకాంక్షలు.... కలల లోనే కదా సాకార రూపు దాల్చేది !
       కొన్ని వేకువజాముకలలైతే త్వరలోనే జరుగబోవు సంఘటనలకు సంకేతాలన్న మాటా  వాస్తవమే... !
    కలలు...వేధించి,బాధించినా,
ఆనందలోకాల్లోవిహరింపజేసినా... అది వట్టి కలే ఐనా...., 
    అనుభూతిoపజేయటంలో  
వాస్తవానికేమాత్రమూతీసిపోవుపగటికలల కన్నా... ఈ స్వప్నానుభవ దృశ్యాలు గొప్పవే... !మనిషికి,  పూర్తి అనుభూతిని కలిగిస్తాయి !!
        *****
కామెంట్‌లు