సుప్రభాత కవిత ; - బృంద
నిన్నలేని శోభలెన్నో 
ఇపుడే ఇలపై జనియించి
కన్ను తెరచి పరచుకున్నట్టూ...

నవవధువు లాటి 
పుడమిముంగిట ప్రతి పువ్వున మధువు పొంగినట్టూ

అరుణకాంతుల
అలవికాని అందాలను గని 
మది పరవశించినట్టూ

పులకరించిన మనసు 
సంతోషం మోయలేక మూగబోయినట్టూ...

ఎద సడిలో  ఎవరికీ తెలియని
సన్నని  సంతోషపు సందడి
ఎల్లెడలా పరచుకున్నట్టూ..

కుసుమాల మిసమిసలు
చూచి తుమ్మెదల గుసగుసలు
శ్రావ్యంగా వినిపించినట్టూ

కోరికలు రాగమాలికలుగా
ప్రకృతి  ప్రబంధ కావ్యంగా
మధురభావనల మేల్కొలిపే

మహోదయానికి

🌸🌸 సుప్రభాతం 🌸🌸


కామెంట్‌లు