శోభకృతు నామ ఉగాది శుభాకాంక్షలతో
============================
న్యాయాలు -81
తీర బక న్యాయము
******
తీరము అంటే గట్టు, ఒడ్డు అని అర్థం.బకము అంటే కొంగ.
ఏరు ,చెరువు,నదుల మొదలైన యొడ్డున అంటే నీటి పట్టులందు కొంగ జపము చేయుచున్న దానివలె నటిస్తూ, ఓర్పుతో నేర్పుతో వేచియుండి సమీపించిన చేపలను గుటుక్కున మ్రింగి వేస్తుంది.ఇలా మోసం చేసి తన పబ్బం గడుపుకోవడాన్ని 'తీర బక న్యాయము' అంటారు.
దీనినే 'బక వృత్తి న్యాయము' అని కూడా అంటారు.
నమ్మించి మోసం చేసే వ్యక్తులను దృష్టిలో పెట్టుకొని ఈ తీర బక న్యాయమును ఉదాహరణగా చెబుతుంటారు.
మరి 'తీర బక న్యాయము' లేదా 'బక వృత్తి న్యాయము' ఎలా ప్రాచుర్యంలోకి వచ్చిందో చూద్దాం.
కొంగల ఆహారం చేపలు. అవి ఎక్కువగా నీటి తావుల దగ్గర తిరుగుతూ ఉంటాయి. ఏరు, చెరువు,నదుల గట్టున ఏ చిన్న తుప్ప, గడ్డి లాంటివి ఉన్నా వాటి మీద ఒంటి కాలి మీద నిలబడి కాచుకుని ఉంటాయి. అవి నిలబడిన తీరు తపస్సు చేస్తున్న మునులు, యోగుల్లా కనిపిస్తాయి. మునులు భగవంతుని ప్రార్ధిస్తూ తమ తపస్సు ను తీవ్ర స్థాయిలో చేసేటప్పుడు ఒంటికాలిపై నిలబడతారని చదువుకున్నాం.
కొంగలు కూడా మునుల్లా ఒంటికాలిపై నిలబడతాయి. అలా నిలబడే అటువైపుగా వచ్చే చేపల కోసం దృష్టి పెడతాయి. అవి తమ దాపులోకి రాగానే చటుక్కున దొరక బుచ్చుకుని తింటాయి.
అయితే ఇందులో ఏం ప్రత్యేకత ఉంది అనిపించ వచ్చు.కానీ అవి కదలక నిశ్చలంగా నిలబడిన తీరు ఎంతో నిష్ఠగా ధ్యానం చేస్తున్నట్లు ఉంటుంది.
కానీ అలా చేసేది మునుల్లా మోక్ష ప్రాప్తి కోసం మాత్రం కాదు. అక్కడ తిరిగే చేపలను మోసగించి తమ కడుపు నింపుకోవడానికి.
దీనికి సంబంధించిన ఓ కథను చూద్దాం.... ఒకానొక కొంగకు వేటాడి, తినే ఓపిక నశించింది. ఏం చేయాలో బాగా ఆలోచించగా దానికి ఒక ఉపాయం తట్టింది. వెంటనే అమలులో పెట్టింది.
ఒడ్డున ఒంటి కాలి మీద నిలబడి కళ్ళు మూసుకుని జపం చేస్తున్నట్లు నటించడం మొదలు పెట్టింది.దానిని దూరం నుండి గమనించిన చేపలకు ఇది చాలా ఆశ్చర్యంగా అనిపించింది.
కొంగ అలా తమను వేటాడకుండా కదలక మెదలక ఉండటంతో అది తమను ఏమి చేయదనే ధైర్యం వచ్చింది చేపలకు.
దగ్గరకు వెళ్ళి విషయం అడిగాయి. కొంగ తాను ఎంతో మారిపోయానని, కళ్ళు మూసుకుని ఒంటి కాలితో భగవంతుని ధ్యానిస్తూ ఉన్నానని చెప్పింది.
కొంగ చెప్పి మాటలను నిజమని నమ్మి,,కొంగ మారిపోయింది అనుకున్నాయి.నిర్భయంగా దాని చుట్టూరా, సమీపంలోనూ తిరగడం మొదలుపెట్టాయి.
ఇంకేముంది తన చుట్టూ తిరుగుతూ ఉన్న చేపల్లో దగ్గరకు వచ్చిన చేపలను ఇతర చేపలు చూడకుండా చటుక్కున పట్టుకొని గుటుక్కున తినడం మొదలు పెట్టింది. అలా ఎలాంటి శ్రమ లేకుండా ఆహారాన్ని సంపాదించుకొని కడుపారా తిన సాగింది.
ఇలా కొంగలా మంచి వారిగా, సాధుత్వం నటిస్తూ మోసం చేసే వ్యక్తులు మన చుట్టూ ఉంటారని హెచ్చరించేందుకు ఈ తీర బక న్యాయము లేదా బక వృత్తి న్యాయమును ఉదాహరణగా చెబుతుంటారు.
కాబట్టి అలాంటి వారిని నిశితంగా గమనిస్తూ వారికి దూరంగా, మోసపోకుండా వుండాలి.
ప్రభాత కిరణాల నమస్సులతో 🙏

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి