మనసు ; -కొప్పరపు తాయారు

 శరీరం మనస్సుకు సేవ చేసే బంటు. మనసు ఇచ్చే ఆజ్ఞలను దేహం శిరసావహిస్తుంది. అటువంటి ఆజ్ఞలు మనస్సు ఎంచుకున్న వైన కావచ్చు, లేదా అసంకల్పితంగా జారీ చేసినవైనా కావచ్చు. దురాలోచనలు మోస్తున్న మనస్సు వలన దేహం త్వరగా రోగగ్రస్తమై, నశించక తప్పదు. ఆనందకరమైన సుందరమైన ఆలోచన తరంగాలు జారీచేసిన ఆజ్ఞలకు, శరీరం అందంతో, యవ్వనముతో తొణికిసలాడుతుంది.
          పరిస్థితులలాగా, రోగం, ఆరోగ్యం కూడా ఆలోచనల నుండి పుడతాయి. అనారోగ్యపు ఆలోచనలు, అనారోగ్యం ద్వారా వ్యక్తమవుతాయి.భయపు ఆలోచనలు ఖచ్చితంగా వేలాది మందిని కొద్ది కొద్దిగా హతమారుస్తూనే ఉన్నాయి. రోగ భయంతో జీవించే వారికే రోగాలు తప్పక వస్తాయి. ఆందోళన శరీరానంతటిని బలహీన పరిచి, రోగానికి ద్వారం తెలుస్తుంది. దురాలోచనలు అమలు చేయకపోయినాప్పటికీ కూడా మనిషి నాడీ వ్యవస్థను తప్పక త్వరలో దెబ్బతీస్తాయి.  
               దృఢమైన, నిర్మలమైన, సంతోషకరమైన ఆలోచనలు మన శరీరాన్ని శక్తితోను, హుందాతనముతోనూ నింపుతాయి. శరీరం చాలా సున్నితమైనది, ముడుచుకుపోగల, వికసించగల గుణాలు కలది. కాబట్టి, దేహం మీద ముద్రపడే ఆలోచనా  తరంగాలకు శరీరం సులువుగా స్పందిస్తుంది. అలవాటుగా మారిన ఆలోచన ధోరణి తన ప్రభావాన్ని దేహం మీద చూపిస్తుంది. అవి మంచివైతే మంచి ప్రభావం, చెడువైతే చెడు ప్రభావం శరీరం మీద పడుతుంది.
కామెంట్‌లు