సమాజంలో ప్రతి ఒక్కరు భగవత్ చింతన కలిగి ఉండాలని, అప్పుడే వారికి మానసిక ప్రశాంతత, మంచి ఆరోగ్యం, దీర్ఘాయుష్షు కలుగుతుందని శాస్త్రవాక్యం. సమాజంలో ప్రజలకు మానసిక ప్రశాంతత కొరవడింది కాబట్టి ప్రతీ ఒక్కరు తాము ఎంచుకున్న మార్గంలో దైవభక్తిని కలిగి ఉండాలి . దైవభక్తే అన్నింటికీ మూలమని భగవద్గీతలో కూడా శ్రీకృష్ణుడు ప్రభోధించారు. మన శాస్త్రములు చెప్పిన విషయాలు పరమ సత్యము అని, మనము అనన్యమైన విశ్వాసము కలిగి ఉండదం ఎంతో అవసరం. శాస్త్రవిహితముగా జీవనం గడపలేము అనుకుని, శాస్త్ర వాక్యములను వదిలిపెట్టరాదు. ఆధునిక/పాశ్చాత్య జీవన విధానమునకు మనం బానిసలుగా మారకూడదు. మన కోరికలను కొంచెం తగ్గించుకుంటే, ధనార్జన అనే తృష్ణకి లోనుకాకుండా ఉండగలగుతాము, తద్వారా శాస్త్ర విహిత జీవనాన్ని, అనుష్టానమును వదిలిపెట్టవలసిన అవసరం రాదు. ప్రతీ మనిషికీ జీవితంలో కొంత ధనము అవసరమే, కానీ కేవలం ధనం సంపాదించడం ఒక్కటే జీవిత లక్ష్యంగా పెట్టుకోకుండా ఉన్నవాడికి, భగవత్ చింతన చేయడానికి, శాస్త్ర విహిత జీవనం గడపడానికి చాలా సమయం దొరుకుతుంది. శాస్త్రము చెప్పినట్లు బ్రతికే వాడికి, శాంతి, సంతృప్తి మరియు తరగని సంతోషం వాటంతట అవే వస్తాయి అని కంచి పరమాచార్య తరచుగా తమ ప్రవచనాలలో బోధించేవారు. కలి కల్మషం కారణంగా మానవులు సత్ప్రవర్తన, సచ్చీలత, క్రమశిక్షన, పరిశుద్ధమైన మనసుతో భగవత్ చింతన చెయ్యలేకపోతున్నారు.ఫలితంగా ఎంతో అశాంతిని, ఆందోళనలను మూటకట్టుకుంటున్నారు. మానవుడు తన పరమపద సోపాన మార్గంలో సనాతన ధర్మం మరువరాదు. ఆధ్యాత్మికత మేళవించినటువంటి ఈ మార్గంవలన మానవునికి చక్కని జ్ఞానం అలవడుతుంది. అది సకల మానవాళికి మాత్రమే కాదు విశాల విశ్వానికి శాంతిని చేకూరుస్తుంది. సనాతన ధర్మం శాంతి సమైక్యతకు సంపూర్ణంగా తోడ్పడగలదు. మనుషులంతా ఒక్కటే అన్నది సనాతన ధర్మం భావం. ఈ విషయం అందరూ గమనించాలి.
ముఖ్యంగా మానవుడు సనాతన ధర్మం మార్గంలో నడుచుకోవడానికి ముందు తనలోని స్వార్థాన్ని, ఈర్ష్యా ద్వేషాలను సంపూర్ణంగా విసర్జించాలి. మానవ జన్మకు సార్థకత చేకూర్చగలగాలి.
ముఖ్యంగా మానవుడు సనాతన ధర్మం మార్గంలో నడుచుకోవడానికి ముందు తనలోని స్వార్థాన్ని, ఈర్ష్యా ద్వేషాలను సంపూర్ణంగా విసర్జించాలి. మానవ జన్మకు సార్థకత చేకూర్చగలగాలి.
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి