సుప్రభాత కవిత ; - బృంద
ప్రతి  ప్రభాత వేళ లో
ప్రభవించే వెలుగులలో
ప్రతి పువ్వుల పలకరింపులో
ప్రత్యూష పరవశాలు

చిగురాకు మిలమిలలలో
కిరణాల జిలుగులు
చిరు జల్లుల నీహారికల
చిరునవ్వుల తళతళలు

విరిసిన పూలతో నిండిన
అందమైన తీగలు అల్లుకున్న
చెట్టుపైని గూటిలో
గువ్వల జంటల కువ కువలు

హృదయరంజకమైన ఉదయపు
వెలుగురేఖల మెరిసిన
పువ్వుల నవ్వుల వెలిగే
అపుడే విచ్చిన రేకులు

గాలి చెప్పే కబుర్లకు
తలలూపుతున్న తీగలు
కుదురు దొరకక
కదిలి పాడుతున్న తుమ్మెదలు

తొలిపొద్దున విరిసే
వెల లేని భావాలు
మరిమరీ ఆనందం
పండించి పంచాలని

🌸🌸  సుప్రభాతం 🌸🌸

కామెంట్‌లు