పోరాటం వద్దు-ఐక్యతే ముద్దు. ;- డా.బెల్లంకొండనాగేశ్వరరావు.చెన్నయ్.
 అటవీశాఖలో అధికారిగాపనిచేసిన విశ్రాంత ఉద్యోగి రాఘవయ్య తాతగారి ఇంటి అరుగుపైన ఆవీధిలోని పిల్లలంతా కథవినడానికి చేరారు.అందరికి మిఠాయిలు పంచిన తాతగారు "బాలలు ఈరోజు ముందుగా కలసిఉంటే కలదుసుఖము అన్నారుపెద్దలు. ఐకమత్యంగురించి తెలుసుకుందాం. అనంతరం ఐకమత్యవిలువతెలిసే కథచెపుతాను....
ఒక కమ్యూనిటీ కి కానీ లేదా ఒక సంఘానికి కానీ ఒక రాష్టానికి కానీ లేదా ఒక దేశానికి గాని అందులో ఉన్న ప్రజలకి భౌతికంగా వారి వనరులను కోల్పోయినప్పుడు వారి జీవన అభివృద్ధి కోసం చేసే సహాయాలను ఐకమత్యంగా ఉండి వారికీ అందచేయడం ఆర్ధిక ఐకమత్యం.
ప్రజల జీవన శైలి లో వారికీ ఎదురయ్యే సవాళ్ళ అభివృధి కోసం పరిష్కారలా కోసం జీవన సౌలభ్యం మెరుగు పరుచుకోవడం కోసం వారి సమానతల న్యాయం కోసం జరిగే ఐకమత్యమే రైట్స్ అఫ్ యూనిటి.
ఇప్పుడు కథలోనికివెళదాం!...
తమముందుఉన్నఒకరొట్టెకోసం రెండుపిల్లులు ఈరోట్టె నాకంటే నాకే కావాలి అని వాదులాడుకోసాగాయి.
అటుగావెళుతున్నకోతి, పిల్లుల వాదులాటవిని"ఏమిటి అల్లుళ్ళు మీలో మీరేవాదులాట"అన్నది.
"కోతి మామా ఈరొట్టెను ముందుగా నేనేచూసాను ఇదినేనే తింటాను" అన్నది మొదటి పిల్లి."లేదు రొట్టెను మొదట నేనేచూసాను కనుక ఈరోట్టెను నేనేతింటాను"అన్నది రొండోపిల్లి.
" అల్లుళ్ళు మధ్యవర్తిగా నేను మీకు తీర్పుచేపుతాను,రొట్టెను రెండు ముక్కలు చేసి మీఇద్దరికి చెరిసగం సమంగా పంచుతాను"అందికోతి.
"కోతిమామా యాభై ఏళ్ళక్రితం మీతాత ఇలా పంపకంపేరున రొట్టెను రెండుముక్కలుచేసి,ఈభాగం ఎక్కువఉంది,కాదు మరోభాగం ఎక్కువ ఉంది అంటూ రెట్టెమొత్తం కోతి మామే నాడు తిన్నాడట,ఆకథమాకు మాపెద్దల ద్వారా తెలుసు, పెద్దలుచెప్పే కథలు వినడంవలన, చదవడం వలన బోలెడు లోకజ్ఞానం పొందవచ్చనితెలుసుకున్నాం,అయినా పోరాటం వలన లాభంఏముంటుంది గాయాలుతప్ప, పోరాటం వద్దు ఐకమత్యమే ముద్దు.అని మేంతెలుసుకున్నాం,మా వచ్చిన సమస్యను మేమే పరిష్కరించుకుంటాం ఇందులో నీజోక్యంవద్దు, ఇతరుల మేథస్సును,ధనాన్ని శ్రమను,ఆహారాన్ని దోచుకోవడానికి నీకు సిగ్గు అనిపించడంలేదు,మనం మన అవసరాలకు ఎలా దాచుకుంటామో, ఎదటివారుకూడా వారి అవసరాలకు అలానే దాచుకుంటారు. దొంగతనముచేసి మోసగించి ఎవరూ పెద్దవాళ్ళుకాలేరు అటువంటి చర్యలవలన సమాజం మనల్ని హీనంగాచూస్తుంది ఎవ్వరూ మనల్ని గౌరవించరు,మనకన్న చిన్నప్రాణులు ఆహారంకోసం అలుపు ఎరుగని పోరాటం చేస్తున్నాయి వాటినిచూసి నేర్చుకో! మాసమస్య మేము పరిష్కరించుకోగలం వెళ్ళు "అన్నది మెదటి పిల్లి.
సిగ్గుతో తలవంచుకుని వెళ్ళిపోయింది కోతి.

కామెంట్‌లు