న్యాయాలు-74
జలౌష్ణ్య న్యాయము
*****
జలము అంటే నీరు.జలము స్వభావసిద్ధంగా శీతలంగా ఉంటుంది. అయితే కాగబెట్టినప్పుడు నీరు వేడిగా మారుతుంది.
వేడిగా ఉన్న నీటిని వేడి నీరు అనే వ్యవహరిస్తారు.కానీ మామూలుగా నీళ్ళు అని అనరు.
చూడటానికి అవి నీళ్ళే కానీ ముట్టుకుంటే చురుక్కుమని కాలుతాయి. అంటే నీళ్లు తమ సహజ గుణాన్ని కోల్పోయి హాని కలిగించే విధంగా అయ్యాయి అన్న మాట.
అలాగే 'చెడ్డవారితో సహవాసం చేస్తే మంచి వాడు కూడా చెడ్డ వాడుగా పేరు తెచ్చుకున్నట్లు' అనే అర్థంతో ఈ జలౌష్ణ్య న్యాయమును ఉదాహరణగా చెబుతుంటారు.
ఇలాంటి న్యాయానికి దగ్గరగా ఉన్న సుమతీ శతక పద్యాన్ని చూద్దాం.
పాలను గలిసి జలమును / బాలవిధంబుననే యుండు బరికింపంగా,/ బాల చవి జెరచు, గావున/ బాలసుడగువాని పొందు వలదుర సుమతీ!
పాలలో నీళ్ళు కలిసినప్పుడు పాల వలెనే కనబడతాయి.కానీ పాల రుచిని పాడు చేస్తాయి.అలాగే చెడ్డ వాడితో స్నేహము చేస్తే మంచిగుణములు పోతాయి.కాబట్టి చెడ్డవారితో సహవాసం చేయకూడదు.
మంచివారిని చెడగొట్టే స్నేహం కూడదు, అలాగే దొంగతో తిరిగిన వాడు దొరలాంటి మనసున్న వాడైనా దొంగగా పిలవబడతాడు.అలాగే గంజాయి వనంలో తులసి మొక్క ఉన్నా దానిని ఎవరూ పట్టించుకోరు పైగా గంజాయి మొక్కను చూసినట్లే అసహ్యంతో చూస్తారు.
ఓ కవి చెప్పిన ఈ చిన్న శ్లోకంలో ఈ న్యాయానికి సంబంధించిన విషయాన్ని చూద్దాం.
'దుర్జనేన సమం వైరం ప్రీతిం చాపి న కారయేత్/ ఉష్ణో దహతి చాంగారః శీతః కృష్ణాయతే కరమ్!'
ఈ శ్లోకం భావం ఏమిటంటే చెడ్డ వాళ్ళు బొగ్గు లాంటి వారు.శతృత్వంతో అంటే వేడిగా ఉన్నప్పుడేమో చేతులను కాలుస్తారు.
చల్లగా ఉన్నప్పుడు అంటే స్నేహంగా ఉన్నప్పుడు కూడా చేతులను మసి చేస్తారు.అంటే చెడ్డ వారితో స్నేహం ఎంత ప్రమాదకరమో చెప్పే ఈ శ్లోకం "జలౌష్ణ్య న్యాయమునకు" చక్కని ఉదాహరణగా చెప్పుకోవచ్చు.
ప్రభాత కిరణాల నమస్సులతో 🙏

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి