అంతల పొంతల వాడు:-కల్పించుకొని తెచ్చి పెట్టుకున్న దూరపు చుట్టము.
ఈ జాతీయము పుట్టుటకు ఒక చిన్న కథ కలదు.
ఒకానొకప్పుడు ఓ వ్యక్తి ఓ ఊరికి చేరాడు. ఆ ఊరిలో అతనికి తెలిసిన వారెవ్వరు లేరు. ఆకలి బాగా అవుతున్నది. అప్పుడు అతడు ఒక ఇంటిలోనికి దూరాడు. సరాసరి వంట ఇంటిలోనికి వెళ్ళాడు. ముందరి వసరాలు యజమాని కూర్చుని ఉన్నాడు. అతన్ని అసలే పలకరించకుండా లోనికి వెళ్ళాడు. యజమాని అనుకున్నాడు తన భార్యకు సంబంధించిన బంధువని..... వంటింట్లో యజమానురాలు అనుకున్నది ఆయన గారి బంధువు కావచ్చని. సరే భోజనాలు చేశారు. ఆ తరువాత యజమాని అడిగాడు"ఎవరు మీరు"అని,"అయ్యా!
మరచిపోయారు. నేను మీ దూరపు బంధువును నేను కాశీ నివాసిని"అని అన్నాడు. ఈ యజమాని బ్రాహ్మణుడు కాబట్టి అప్పుడప్పుడు కాశి వెళ్లి వస్తాడు. కాబట్టి"బంధువు"కావచ్చు అని సరి పెట్టుకున్నాడు. భార్య అడిగింది"ఎవరండీ వారు?"అని"మన దూరపు బంధువులేవే"అని జవాబు ఇచ్చాడు. ఈ విధంగా కొన్ని సందర్భాలు ఏర్పడతాయి. అట్టివాడినే అంతల పొంతల వాడు అని అంటాము.
తెలుగు జాతీయం.;- తాటి కోల పద్మావతి గుంటూరు
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి