"తెలుసుకో గలిగితే... !"
*****
ప్రకృతి కి.... వికృతి లా
తయారైన మగాడిలో ...
మహిళపట్ల చులకన భావం
తెలుసుకో గలిగితే.....
ఆమె ఆదిశక్తి స్వరూపం !
మోకరిల్లి చేస్టాడు...
పాదాభివందనం... !!
*******
@ తెలుసుకోదు... !@
****
తానే నెంబర్ వన్....
అనుకుంటాడు మగాడు.. !
భార్యను...విలువలేని
సున్న గా భావిస్తాడు !!
ఆ సున్న వచ్చి చెరబట్టే...
తనవిలువ తొమ్మిది రేట్లు
పెరిగి, తాను పది యై....
పోజు కొడుతున్నానని...
తెలుసుకోడు... !!
. *******
@ * ఆమె * లేకుంటే... !@
******
పురుషుని.... ధర్మార్ధ, కామ,
మోక్ష సాధనకు...
స్త్రీయే... మూలం... !
మాగాడి జీవితంలో...
. మహిళ లేకుంటే.....
సర్వం.... సూన్యం.... !!
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి