తిమిరాలు హరియించి
ఆనందపు అనుభవాలిచ్చు
తూరుపు వైపు పయనం
అదృష్టం అవకాశం అనే
పట్టాలపై సాగి
గమ్యం చేర్చే జీవనం
ఎవరి తోడు ఎంతవరకో?
ఏ ఆనందం ఎంత సేపో?
కాలం నడిపే రైలుబండి
ప్రయాణం సరదాగా సాగాలి
క్షణాలు తీయగా మార్చుకోవాలి
గెలుపు గమ్యమవాలి
మనది కాని ప్రపంచంలో
మన ప్రమేయమే లేకుండా
మన బ్రతుకు బండి గమనం
ఆశల జ్యోతులు
వెలిగించుకోవాల్సిందే!
గమ్యం కోసం వేచి ఉండాల్సిందే!
పలకరించే మబ్బులూ
పచ్చికబయళ్ళూ....పిచ్చుక గూళ్ళూ. అన్నీ ఆనందాన్నిచ్చేవే!
తూర్పును వెలిగించినా
పడమటను తొలగిపోయినా
పునరాగమనానికే!
మనం మోసే బరువు
మరపురాని మమతల
అపురూప జ్ఞాపకాలే!
వేదనైనా వేడుకైనా
దొరికే స్నేహాలైనా
అన్నీ అనుభవాలే!
మనసు మనదే!
మనుగడ మనదే!
మమతలూ మనవే!
గడచిన క్షణం గతమైతే
రాబోవు ఉదయం ఊతం
🌸🌸 సుప్రభాతం 🌸🌸
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి