కందం:
*దీనుండైనను శాత్రవు*
*డైనన్ శరణనుచు వేడునపుడు ప్రియత స*
*మ్మానవుని కోర్కె దీర్చిన*
*వాని సుజనుడండ్రు బుధులు వసుధ కుమారా !*
తా:
కుమారా! ఎంతో బాధను, దుఃఖాన్ని అనుభవిస్తూ తనను రక్షించమని వచ్చినవాడు మన విరోధి, శత్రువు అయినా కూడా, ఆ శత్రుత్వాన్ని పక్కనబెట్టి, ఆ విరోధికి రక్షణ కల్పించిన వ్యక్తి చాలా మంచి వాడుగా, గొప్పవాడుగా ఈ భూమి మీద పొగడ బడతాడు............. అని పక్కి లక్ష్మీ నరసింహ కవి చెపుతున్నారు.
*భావం:*
*మనల్ని కోరి వచ్చినవారు శత్రువైనా ఆదరించడం, అనాదిగా మన సంస్కృతి. ఈ విధానాన్ని ఆచరించడం లో శిబి చక్రవర్తి అగ్రగణ్యుడు. తనను దానం అడగడానికి వచ్చినవాడు రాక్షసాంతకుడైన లక్ష్మీరమణుడు అని తెలిసినా కూడా, తాను ఇస్తాను అన్న దానం ఇవ్వడానికి ముందుకు వెళితే, తనను కాపాడాలని, శుక్రాచార్యుడు కమండల ద్వారం లో అడ్డుపడి, దర్భపుల్లతో కన్ను పోగుట్టుకున్నా కూడా ఇవ్వదలచిన మూడు అడుగుల దానం ఇచ్చి చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయాడు. అలాగే, అలాగే, అతిరథుడై కూడా అర్థ రథుడుగా మిగిలిపోయిన అంగ రాజ్యాధిపతి కర్ణుడు. వచ్చినవాడు ఇంద్రుడు అని తెలిసినా కూడా, కవచ కుండలాలు దానం ఇచ్చి, చెరిపి వేయలేని, ఎవరూ సాధించలేనంత కీర్తిని సొంతం చేసుకున్నాడు. కర్ణ, శిబి చక్రవర్తులను ఆదర్శంగా తీసుకొని, మనకు వీలయినంత వరకు, మన మనసులో వైరి భావం ఉన్న వారిని కూడా ఆందరించ గలిగే మంచి మనసు మనకందరకు ఇవ్వమని...... కలియుగ ప్రత్యక్ష దైవం, అలన్మేల్మంగా పద్మావతీ సమేత వేంకటేశ్వరుని ప్రార్ధించుకుందాము.*
*శివో రక్షతు! శివో రక్షతు!! శివో రక్షతు!!!*
..... ఓం నమో వేజ్ఞ్కటేశాయ
Nagarajakumar.mvss

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి