*"కుమార శతకం " - పక్కి లక్ష్మీ నరసింహ కవి - పద్యం 095*
 కందం:
*కడు మెల్ల న్నిడు ను త్తర*
*మడచును గోపమును దీక్ష్మ మరయగ దాన*
*ప్పుడు నుడివెడు నుత్తర మది*
*వడి గోపము బెంచు నరయ వసుధ కుమారా !*
తా:
కుమారా! ఆలోచించి చూస్తే, ఈ భూమి మీద ఎదుటివారు కోపంతో ఉండి మనతో ఏదైనా మాట్లాడినప్పుడు, మనం కొంచెం ఓపికతో ఉండి, ఆలోచించి మన సమాధానం చెపితే గొడవ జరిగే అవకాశం ఉండదు. అలా కాకుండా, వారితో సమానంగా మనం కూడా అలాంటి ఆవేశంతోనే సమాధానం చెపితే, వాగ్వాదం పెరిగి తప్పకుండా గొడవ జరుగుతుంది .............. అని పక్కి లక్ష్మీ నరసింహ కవి చెపుతున్నారు.
*భావం:*
*ఈ సన్నివేశం ఎక్కువగా మనం మన ఇంట్లోనే చూస్తూ ఉంటాము. పనిచేసే చోట కూడా ఉండే అవకాశం ఉంది, కానీ అరుదుగా. ఆఫీసులో కొరి మీద ఒకరు గట్టిగా మాట్లాడుకోవడం అరుదుగా ఎందుకు ఉంటుంది, అంటే అక్కడ మనం పని చేసే ఆ చోటును గానీ, మాట్లాడే మనుషులను కానీ, "మన" అనుకోము కాబట్టి. మరి ఇంటి దగ్గర విషయం ఏమంటే, ఆ ఇల్లు మనది, ఇంట్లో వారు మనవాళ్ళు, అంతా మనదే అయినప్పుడు మన మాట ఎదుటి వారు ఎందుకు వినకూడదు అనే అహం తనవంతు పాత్ర పోషించడం వల్ల, కోపం తారస్థాయికి చేరి గొడవదాకా పోతుంది. కాబట్టి, అహం, కోపం, మన తలకు ఎక్కకుండా, మంచి మనోభావాలతో బ్రతికేలా పరమేశ్వరుని అనుగ్రహం మనకు ఉండాలని........ కలియుగ ప్రత్యక్ష దైవం, అలన్మేల్మంగా పద్మావతీ సమేత వేంకటేశ్వరుని ప్రార్ధించుకుందాము.*
*శివో రక్షతు! శివో రక్షతు!! శివో రక్షతు!!!*
..... ఓం నమో వేజ్ఞ్కటేశాయ

Nagarajakumar.mvss

కామెంట్‌లు