కందం:
*ధర గరవుగోరి దానం*
*బిరువున నిడుకొనిన వారి నెగ్గింప దలం*
*తురు; వాని నమ్మదలచిన*
*పురుషుని నుత్తము డటంచు బొగడి కుమారా !*
తా:
కుమారా! ఈ భూమి పైన కరువు వచ్చినప్పుడు, తన వద్ద ఉన్న డబ్బు, వస్తువులు, ఎదుటి వారికి ఉపయోగపడాలి అని స్నేహ భావంతో, ఉదారంగా అందరికీ ఉచితంగా పంచి పెట్టిన వారి మంచి గుణాన్ని సమాజం అర్థం చేసుకోదు. మెచ్చుకోదు. అదే సమాజం, తమకు అవసరమైన అవే వస్తువులను, డబ్బులు తీసుకొని అమ్మే వారిని చూసి మాత్రం, "ఎంత మంచి పని చేస్తున్నారు, మనకు అన్ని అమ్మకానికి సిద్దంగా ఉంచారు" అని మెచ్చికుంటుంది.............. అని పక్కి లక్ష్మీ నరసింహ కవి చెపుతున్నారు.
*భావం:*
*అయాచితంగా వచ్చేది ఎదైనా, మనిషి ప్రేమ అయినా, దానమైనా, సహాయం అయినా తన విలువను కోల్పోతుంది. ప్రేమ, ఔదార్యం, గౌరవం మొదలైనవి అన్నీ బజారులో అమ్ముడుపోయే వస్తువులు అయ్యాయి. మనం నిస్సహాయంగా ఉన్నప్పుడు సహాయం చేసిన వారిని కూడా గుర్తుంచుకోలేని స్థితిలో ఇప్పటి మన సమాజం ఉంది. అదే సాయం విలువ తీసుకుని చేస్తే, ఆ సాయాన్ని ఎంతో విలువైనదిగా పరిగణిస్తారు. ఎందుకంటే, ఇప్పటి మన సమాజంలో కనిపించని ఒక వింత వస్తవు "మనిషికి ఉండ వలసిన విలువలు." అలా కనుమరుగై పోయిన / పోతున్న ఈ విలువల కోసం నిలబడగలిగే శక్తి సామర్ధ్యాలను ఇమ్మని........ కలియుగ ప్రత్యక్ష దైవం, అలన్మేల్మంగా పద్మావతీ సమేత వేంకటేశ్వరుని ప్రార్ధించుకుందాము.*
*శివో రక్షతు! శివో రక్షతు!! శివో రక్షతు!!!*
..... ఓం నమో వేజ్ఞ్కటేశాయ
Nagarajakumar.mvss

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి