ఛాయాగ్రాహిణి ఇక్కడ చరిత్రకు సంబంధించిన విషయాన్ని తన కథలో పొందుపరిచి వాల్మీకి మహర్షి మనకు అందజేసిన సంఘటన. రావణాసురుడు పరిపాలిస్తున్న లంక చుట్టూ ఉన్న సముద్రం అక్కడ ఈ ఛాయాగ్రహిణి కాపలాగా ఉంటుంది దాన్ని శాస్త్రజ్ఞులు ఈ మధ్య కనిపెట్టిన విషయం ఏమిటంటే ఆ ప్రాంతంలో ఆకాశంలో వెళుతున్న ప్రతి వస్తువు పక్షి దగ్గర నుంచి విమానం వరకు అటు వస్తే ఈ ఛాయాగ్రహిణి ఆకర్షిస్తుంది ఆ తరువాత దీని రూపురేఖలు కూడా ఎక్కడా కనిపించవు అలాంటి విపత్కర స్థితిలో హనుమంతుడు చిక్కుకోవలసి వచ్చినది సీతమ్మ వారిని వెతకడానికి అతి పెద్ద ఆకారంలో వెళుతున్న హనుమాన్ ఆ ఛాయకు ఆకర్షితుడైనాడు హనుమంతుని జ్ఞానం అమోఘమైనది. హిమవత్ పర్వతం లాగా ఉన్న తన శరీరాన్ని బొటనవేలు ఉన్నంత పరిమాణంలోకి మారి ఒక్కసారి బయటకు దూకి వచ్చాడు ఇది శాస్త్రజ్ఞులు తెలియజేసిన విషయం కేరళలో కూడా మరొక ప్రాంతం ఇలాగే ఉంటుందని మన పెద్దలు చెబుతూ ఉంటారు తాటకి అన్న రాక్షసి మారీచుడు సుబాహులు అన్న ఇద్దరు రాక్షసులకు తల్లి అలాగే చెప్పుకోదగిన పాత్ర అతి చిన్నది అయినా ఎంతో ప్రాముఖ్యం కలిగిన పాత్ర తార ఆమె వాలికి భార్య అంగదునికి తల్లి శ్రీరామచంద్రమూర్తికి ఎంతో సహకరించిన వాడు అంగదుడు రాయబారిగా కూడా వెళ్లిన నేర్పరి తార లోకజ్ఞానం తెలిసిన గృహిణి వాలి సుగ్రీవులు అన్నదమ్ములు వారి మధ్య తగవులు ఉన్నాయి. శ్రీరాముని అండ చూసుకొని అన్న మీదకు వచ్చి నిన్ను చంపుతాను బయటికి రా అనే కేకలు వేసిన వ్యక్తి వాలి బయటకు వచ్చి తమ్ముడి ఓడించి శతకబాలి బయటికి పంపాడు. వాలి అంటేనే వాలములు పెరిగిన వాడు తోకలు కొమ్ములు పెరిగిన వాడు అని మన పెద్దలు చెబుతూ ఉంటారు గర్వపోతును అలా పిలుస్తారు సుగ్రీవుడు మంచి కంఠము కలిగిన వాడు ఎవరితో ఎలా మాట్లాడాలో భాషా పరంగా సంస్కారహితంగా మాట్లాడగలిగిన వ్యక్తి రాముని స్వామి నన్ను రక్షించలేదు అని అంటే మీరిద్దరూ ఒకే రకంగా ఉన్నారు నాకు గుర్తు తెలియలేదు అని అతనికి ఒక దండ ఇచ్చి ఆ దండ వేసుకుని యుద్ధానికి వెళ్ళమన్నాడు మళ్లీ వారి గుమ్మం దగ్గరకు వచ్చి రా రమ్మని భీష్మించుకొని కేకలు పెడుతూ ఉంటే రోషంతో బయటికి రాబోతున్న వాలిని భార్య వారించి నిన్న ఓడిపోయి దెబ్బలు తిన్నవాడు ఈ రోజున మళ్లీ వచ్చాడు అంటే దీని వెనుక ఏదో రహస్యం ఉండి ఉంటుంది మీరు వెళ్లడం శ్రేయస్కరం కాదు అని సలహా చెప్పింది.
రెడ్డి రాజులు (12);- డా.నీలం స్వాతి,చిన్న చెరుకూరు గ్రామం,నెల్లూరు.6302811961.
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి