రెడ్ల పుట్టుక (12);- ఏ బి ఆనంద్,ఆకాశవాణి,విజయవాడ కేంద్రం,9492811322.
 కడువార నాగలి ఇంద్రుడు కాడి యముడు మేడి సోమవారన సుతులు ఎడ్లు హరిహరులు త్రాల్లు హరుడు గొర్రు వల రాజు పిడిశీల భూమి జనులు రక్షంప వేయు సాలు కవులు పోషింప కల్పతరువు. భళారే రెడ్లకు సరియైన ప్రభువు కలడే అని దేవతలు ఆదిరెడ్డిని పొగిడినాడు. సూర్యచంద్రుడు వరుణుడు వాయువు అగ్ని గంగా బసవదేవుడు అందరి సహకారంతో భూలోపంచేరి  ఒక మడి చెట్టు కింద నివాసం ఏర్పాటు చేసుకుని మంచి ముహూర్తాన ఏరువాక సాగించి వ్యవసాయం ప్రారంభించారు. ఆదిరెడ్డి భూమిని దున్నగా ఆదిలక్ష్మి భూమిలో విత్తనాలు చల్లి,
నవధాన్యాల పైరులను పండించుకుంటూ 84 లక్షల  జంతు జీవరాశులను పోషింపసాగారు. ఆ తరువాత వారికి సంతానయోగం కలిగి 77 మంది కుమారులు ఐదుగురు కుమార్తెలు కలిగారు  వీరు దేవతాంశతో జన్మించినంగానే 77 మంది కుమారులు దేవ దుర్గము లయినారు. అయిదుగురు కుమార్తెలు దేవతలైనారు.
వారు మద్దిరాలమ్మ మహాలక్ష్మి కోరలపాటి ఆంకాలమ్మ  రాచులి పెద్దమ్మ, పోలేరమ్మ వీరు దైవంశ సంభూతులే దేవతలుగా మారారు ఆ తర్వాత ఆదిరెడ్డికి ఒక కుమారుడు కుమార్తె జన్మించారు.  అబ్బాయి పేరు బేతి రెడ్డిగా అమ్మాయి పేరు భ్రమరాంబరా నామకరణం చేసినారు. ఆమెకు యుక్త వయసు రాగానే పరమశివుడు కోరికళ్యాణం చేసుకున్నాడు. బేతిరెడ్డి మర్రి చెట్టు కింద జన్మించడం వల్ల పిల్లలమర్రి బేతి రెడ్డి గా పిలవబడ్డాడు  అతనికి యుక్త వయసు రాగానే పెళ్లి చేయాలని నిర్ణయించి ఇతని వల్ల సంతానం పెరగాలని దేవతలు ఐదుగురు అమ్మాయిలను సృష్టించి వివాహం జరిపించారు  బేతి రెడ్డి పెద్ద భార్యకు 12 మంది, రెండో భార్య 10 మంది, మూడోభార్యకు 8 మంది నాలుగో భార్యకు 6, ఐదవ భార్యకు ఒకరు చొప్పున  మగ సంతానం కలిగారు. వీరి పేర్లు ఉత్తమారెడ్డి, సత్యమారెడ్డి  అన్న వేమారెడ్డి, బొమ్మా రెడ్డి మాచిరెడ్డి. ధర్ముడు భక్తి రెడ్డి  నాటకుడు భక్షి రెడ్డి నారాయణరెడ్డి, సదాశివరెడ్డి, సాంబశివరెడ్డి, అంకిరెడ్డి, తిరుమల రెడ్డి, సంజీవరెడ్డి సాంబమూర్తి రెడ్డి, గోపిరెడ్డి ఓబుల్ రెడ్డి, వెంగళ రెడ్డి, సూరారెడ్డి, వెలుగొండ రెడ్డి అత్తి రెడ్డి, పోలిరెడ్డి, వెంకటరెడ్డి గురవారెడ్డి వీరంతా కలిసి వ్యవసాయం చేసుకొని జీవించుచున్నారు  వీరికి యుక్త  వయసు రాగానే వీరి మేనత్త బ్రమరాంబ సృష్టి వరం జన్మించిన  అమ్మాయిలను ఇచ్చి వివాహం జరిపించారు. తర్వాత మరి చెట్టుని విడిచి మేడలు మిద్దెలు ఇల్లు నూతనంగా నిర్మించుకొని మంచి ముహూర్తాన పాలు  పొంగళ్ళు చేసి గృహప్రవేశం చేసుకొని పూజలు వ్రతాలు జరుపుకున్నారు. అప్పటినుంచి ఊరు ఇవ్వడంతో శివపూజ ఒక పొద్దు భోజనంలో  ఎంతో నిష్టగా ఉండేవాడు  వీరు పెంపుడు జంతువులను ప్రాణప్రదంగా పెంచుకునే వారు.


కామెంట్‌లు
Popular posts
నిశ్శబ్ద కోరిక : - D.రసన్య,10వ తరగతి, తెలంగాణ మోడల్ స్కూల్, ఘన్పూర్ (స్టేషన్), జనగామ (జి)
చిత్రం
తల్లి గర్భము నుండి ధనము తేడెవ్వడు--ఎం బిందుమాధవి
చిత్రం
మహాభారతంలో వింత పేర్లు.డా.బెల్లంకొండనాగేశ్వరరావు. (నేడు సుబ్బారావు.శంకరరావు పేరు పలువురికి ఎలాఉన్నాయో నాటి కాలంలో కూడా ఒకే పేరు పలువురికి ఉండేది.పురాణలపట్ల ఆసక్తి, అవగాహన కోరుకునేవారికొరకు ఈవ్యాసం.) మహాభారతంలో రమారమి 1655 ప్రాత్రలు మనకు కనిపిస్తాయి. 'అజుడు'దశలధమహారాజు తండ్రి.మరో'అజుడు'పాండవులతరపున యుధ్ధంచేసినరాజు అతిరథుడు.(భీష్మపర్వం)అలాగే నలుగురు 'అనువిందులు'1.దుర్యోధనుని తమ్ముడు (ఆదిపర్వం) 2.సహాదేవుని దక్షణదిగ్విజయ యాత్రలో ఓడిన రాజు(సభాపర్వం) 3.కేకేయరాజు (భీష్మపర్వం)4.కౌరవల తరపున పోరాడిన అవంతీశ్వరుడు. (ఉద్యోగపర్వం)ముగ్గురు 'అలంబసులు' 1.జటాసురునికుమారుడు. (ద్రోణపర్వం)2.బకాసురునిసోదరుడు.(ద్రోణపర్వం) 3.ఒకరాజుయుద్ధంలో 14.రోజు సాత్యకిచేతిలోమరణించారు.(ద్రోణపర్వం)ఇద్దరు 'అశ్మీకుడు'లు 1అభిమన్యునిచేతిలో మరణించినకౌరవుడు(ద్రోణపర్వం) 2.ఇక్షాకు వంశరాజు,కల్మషపాదుని కుమారుడు.(ఆదిపర్వం)ఇద్దరు 'ఉగ్రశ్రవశుడు' 1.దుర్యోధనుని తమ్ముడు(ఆదిపర్వం) 2.వ్యాసమహర్షి శిష్యుడు. (ఆదిపర్వం)ఇద్దరు 'ఉగ్రసేనుడు'1.జనమజేయునితమ్ముడు(ఆది) 2.దుర్యోధనుని తమ్ముడు.(ఆది)ఇద్దరు 'ఉగ్రాయుధుడు' 1.పాంచాలకుమారుడు (కర్ణ) 2.దుర్యోధనునితమ్ముడు. (ఆది)ఇద్దరు 'ఉత్తరలు'1దక్షునికుమార్తే (ఆది) 2.వరాటమహారాజు కుమార్తె (విరాటపర్వం)ఇద్దరు 'బుచీకకులు'1.ఔర్యునికుమారుడు. (ఆది) 2.దేవాతిథి కుమారుడు.(ఆది)ఇద్దరు 'కపిల'1.కస్యపునిభార్య. (ఆది) 2.గోవు.(ఆది)ఇద్దరు 'కర్ణులు'1.కుంతికుమారుడు. (ఆది) 2.దుర్యోధనుని తమ్ముడు.(ఆది)ముగ్గురు 'గాంధారీలు'1.కౌరవులతల్లి.(ఆది) 2.అజమీఢుని కుమార్తె(ఆది) 3.కుమారస్వామి కొలువులో దేవాంగన (అరణ్య)ముగ్గురు'గోపతి'లు 1.తపుడు అను వహ్ని పుత్రుడు. (అరణ్య)2.మయసభకు వెళ్లిన ఋషి.(సభా) 3.శిబి మనవడు.(శాంతి )ముగ్గురు 'ఘృతాచి'లు.1.అప్సరస.(ఆది)2.ఛ్యవనుని కోడలు.(ఆది)3.కశ్యపునిభార్య. (ఆది)ముగ్గురు'చంద్రసేనుడు'లు 1.శల్యుని చక్రరథికుడు.(శల్య)2.ద్రౌపతి స్వయంవరంకి వచ్చినరాజు. (ఆది)3.భీముని దిగ్విజయ యాత్రలో ఓడినరాజు. (సభా)ముగ్గురు 'చిత్రుడు'లు 1.పాంచాలరాజు.2. చేధిరాజు.(కర్ణ)ఇద్దరు 'చిత్రరథులు'1.ద్రుపద సంజాతుడు అయిన వీరకేతుని పుత్రుడు. (ద్రోణ)2.రేణుకాదేవి కి నీళ్లవద్ద కనిపించిన వాడు.3.అంగరాజు. (అరణ్య)ముగ్గురు'చిత్రవర్మ'లు1.వీరకేతుని పుత్రుడు. (ద్రోణ) 2.దుర్యోధనుడి తమ్ముడు.(ఆది)3.విరూపాక్ష అంశంతో జన్మించినవాడు. (ఆది)నలుగురు'చిత్రసేనులు'1.కర్ణుని చేతిలో మరణించిన పాండవవీరుడు. (కర్ణ)2.ఘోషూయాత్రలో దుర్యోధనుని బంధించినవాడు.(అరణ్య)3.కర్ణ తనయుడు.నకులునిచేతిలో మరణించాడు.(శల్య)4.పాండవ వీరుడుశ్రుతకర్మ చేతిలోమరణించాడు. (కర్ణ)(మిగిలినవి మరో పర్యాయం.)
చిత్రం
తెలుగు సాహిత్యం-శివ కవులు-- బెహరా ఉమామహేశ్వరరావు--సెల్ నెంబర్: 9290061336.
చిత్రం
గంగిగోవు పాలు గరిటెడైనను చాలు: --ఎం బిందుమాధవి
చిత్రం