ఎవరినైనా ఎదిరించగల సాహసం పల్లెటూరి అనుబంధం రాజకీయ ఖాటిన్యం పరిపాలకుని ఔదార్యం అపార ధైర్య సాహసాలు నాయకత్వ పటు త్వం జనంతో అతిశయితంగా మెలిగే మనస్తత్వం పల్లెలకు రైతులకు ప్రాతిని చేయగల నేతృత్వం కార్య సూరత్వం దృఢ చిత్తం వాక్చాతుర్యం సమయస్ఫూర్తి గాఢమైన ఇష్టా ఇష్టాలు విలక్షణమైన వ్యవహార శైలి ఆశ్రిత పక్షపాతం దూకుడుతనం నిర్మొహమాటం ముక్కుసూటి తనం చొరవా, తెగుగా ఆశ్రయించిన వారి నాదుకోవడానికి ఎంతవరకు అయినా వెళ్ళగలిగిన విశాల హృదయం ఇవన్నీ కలగలిసి డాక్టర్ వైఎస్ అనే రెండు అక్షరాల మంత్రం ఆ మంత్రమే ప్రజల పెదవులపై మధు రస స్పందనగా నిలిచిపోయిన మరుపురాని మనిషి మెరుపులా మాయమైన మనిషి డాక్టర్ వైఎస్ ఏ ప్రజా నాయకుడికైనా ప్రజాభిమానమే కులమాలమని నిరూపించిన ఏకైక ప్రజల నాయకులు డాక్టర్ వైఎస్ హరితాంధ్ర స్వప్నికుడు డాక్టర్ వైఎస్. ప్రజలను ప్రేమించి ప్రజల ప్రేమను పొందిన ప్రేమికుడు డాక్టర్ వైయస్ మూడు దశాబ్దాలుగా గాంధీ కుటుంబానికి విధేయుడు డాక్టర్ వైఎస్. భారత రాజకీయ పటంలో నెంబర్ వన్ ముఖ్యమంత్రిగా తన రూపాన్ని కీర్తి శేఖరుడు డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారి చిత్రించుకున్న ఏకైక ప్రజానాయకుడు డాక్టర్ వైఎస్ఆర్ మానవుని ప్రాథమిక అవసరాలైన తినే తిండి కట్టే బట్ట నిలువ నీడ విద్య వైద్య సదుపాయాలు కల్పనకు కృషి చేసిన ఒకే ఒక్క ముఖ్యమంత్రి డాక్టర్ వైయస్. సమాజంలో ప్రతి సామాజిక వర్గానికి దాదాపు అన్ని వృత్తుల వారికి ఏదో ఒక మేలు చేసే కార్యక్రమాన్ని ప్రారంభించిన ఒకే ఒక్కడు డాక్టర్ వైఎస్ బ్రిటన్ లో 1940 దశలో బ్రిటిష్ ప్రభుత్వం చిన్న స్థాయిలో ప్రవేశపెట్టి సాధ్యం కాక రద్దు చేసుకున్న ఉచిత ఆరోగ్య పథకాన్ని ఎన్నో రేట్లు పెద్దదైన బృహత్ పథకమైన రాజీవ్ ఆరోగ్యశ్రీని ప్రారంభించి కొనసాగించిన ఒకే ఒక ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్.
రైతులకు ఉచితంగా విద్యుత్తును ఇవ్వడం తన విద్యుత్ ధర్మంగా భావించడమే కాకుండా తాను అధికారంలోకి వచ్చిన మరుక్షణమే దాదాపు 1100 కోట్ల విద్యుత్ బకాయిలను రద్దు చేసిన ఘనుడు ఒకే ఒక ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ ఆరేళ్ల క్రితం పంచెను మోకాలి పైకి ఎగకట్టి తలపాక చుట్టి మండుటెండలో మలమల మాడిపోతూ కాంగ్రెస్ పునరుద్దానానికై పునరుజ్జీవనానికి పూనుకుని అచంచలమైన దీక్షతో 1500 కిలోమీటర్ల పాదయాత్ర చేసిన అసలు సిసలు ప్రజల మనిషి కాపురం జన్మ ఎత్తిన ఒకే ఒక ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్. అభిరుద్ది సంక్షేమాలను సమవేగంతో పరుగులు తీయించడంలో ఎవరు భారతదేశానికి అడుగుజాడ అనిపించుకున్న ఒకే ఒక ముఖ్యమంత్రి వైఎస్ తనకు ముందు తొమ్మిదేళ్లు తెలుగుదేశం పాలనలో వాస్తవాలను నిలబెడ్చి సాము చేసిన ప్రభుత్వ విధానాలను పాలనా పద్ధతులను ప్రజలు కొనుకూలంగా మార్చి రాష్ట్ర రాజకీయాలలో చారిత్రక పాత్ర నిర్వహించిన ఒకే ఒక ముఖ్యమంత్రి డాక్టర్ వైయస్.
జననేత వై.ఎస్.ఆర్ (25);-ఏ.బి ఆనంద్,ఆకాశవాణి,విజయవాడ కేంద్రం,9492811322.
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి