ఆదర్శ- వ్యక్తి రంగారెడ్డి (3);- ఏ.బి ఆనంద్,ఆకాశవాణి,విజయవాడ కేంద్రం,9492811322.
 అప్పుడు భారత పార్లమెంటుకు హైదరాబాద్ సంస్థానం నుంచి 25 మంది సభ్యులను నియమించింది వారిలో రంగారెడ్డి గారు  ఒకరు కావడం విశేషం  1948లో వినోభా గారు పోచంపల్లిలో ప్రారంభించిన భూదాన యజ్ఞంలో మొదటి సమిధగా మొట్టమొదటిగా  ముందంజ వేసి 100 ఎకరముల భూమిని త్యాగము చేసిన ఘనుడు  వెదిరే రామచంద్రారెడ్డి గారి పేరు భారత దేశ చరిత్రలో స్థిరంగా ఉండిపోయింది  ఆ భూమి పంపిణీ పై నిస్వార్థపరుడు ప్రజల ఆశాజ్యోతి రంగారెడ్డి గారి పేరుతో  వారిని అధ్యక్షుడిగా చేసి ఒక ట్రస్ట్ ను ఏర్పాటు చేశారు తెలంగాణలో అల్లుకుపోయిన భూదాన విజయం రాజకీయాలతో మునిగి తేలుతున్న నెహ్రూ గారిని సైతం ముగ్ధున్ని  చేసింది. 1952 లో జరిగిన సార్వత్రిక ఎన్నికలలో శంషాబాద్ నియోజకవర్గం నుంచి ఎన్నికైన రంగారెడ్డి గారు  బూర్గుల రామకృష్ణారావు మంత్రివర్గంలో ఎక్సైజ్ కస్టమ్స్ అటవీశాఖ మంత్రిగా పనిచేశారు  1956లో ఆంధ్రప్రదేశ్ అవతరించింది డాక్టర్ నీలం సంజీవరెడ్డి నాయకత్వంలో ఏర్పడిన ప్రథమ మంత్రివర్గంలో  రంగారెడ్డి గారు హోంశాఖ మద్య నిషేధశాఖ నిర్వహించారు. ఆ తర్వాత రెవెన్యూ మంత్రిగా కూడా పనిచేశారు. 1965 జూన్ లో రంగారెడ్డి గారి జన్మదినోత్సవం  నాడు మాజీ ముఖ్యమంత్రి శ్రీ డాక్టర్ బూరుగుల రామకృష్ణారావు గారు రంగారెడ్డి గారిని ఉత్తమ మిత్రునిగా  అగ్రగామి సహచరునిగా స్వచ్ఛమైన ఆలోచన కలవానిగా ప్రజాసేవకుడిగా తెలంగాణ దృష్టికి అనేక సాంఘిక  విద్యా విషయక సంస్థల స్థాపనకు కారణభూతమైన వారిగా చేసిన ప్రశంసా వాక్యాలు వాస్తవికాలు. నిజాయితీపరుడు కాంగ్రెస్ వాదులకు ఆదర్శ పురుషుడు నేషనల్ అని  డాక్టర్ నీలం సంజీవరెడ్డి గారిచే పొగడపడిన ఘనుడు  మంత్రిగా వారు ఫైళ్ళ పై ఇచ్చే ఉత్తర్వులు బాగా విచారించి తీసుకునే తీర్పుగా ఉంటాయి  వారు చేసే తీర్పులు హైకోర్టు జడ్జి తీర్పులాగా ఉండును అని మాజీ ముఖ్యమంత్రిగా సంజీవయ్య గారు చేసిన వ్యాఖ్య  వారికి న్యాయవాద వృత్తిలో గల నాయకుడు మంత్రిగా వ్యవహరిస్తున్నప్పుడు ఏ కోణంలో తోడ్పడిందో చెప్పకనే చెప్తున్నాయి  అంతేగాక పెద్దలు ఆత్మీయ  వాక్యములు తెలుసుకొనడంతో పాటుగా వారి ఆశయ సాధనకై కృషి చేసిన వారు స్వీయ చరిత్ర రాసినందుకు అర్థం పరమార్థం చేకూర గలదు  అన్న విషయం వీరి  జీవిత చరిత్ర వల్ల మనకు తెలుస్తుంది.




కామెంట్‌లు