పెదవి దాటని మాటలు;- డా.నీలం స్వాతి,చిన్న చెరుకూరు గ్రామం,నెల్లూరు.6302811961.
పడతి పలుకని పలుకులివి,
మృదువైన తన మదికి, 
గాయాలు ఎన్ని తగిలినా సరే…
మౌనమే సమాధానంగా, ఆమె పెదవి 
దాటక ఆగిన మది మాటలు ఎన్నో...
తాను చేయని తప్పుకు,
నలుగురు తననే నిందిస్తున్నా సరే...
మౌనమే సమాధానంగా,ఆమె పెదవి 
దాటక ఆగిన మది మాటలు ఎన్నో…
సూటిపోటి మాటలతో సమాజం 
తనను సూదుల్లా హింసించినా సరే...
మౌనమే సమాధానంగా, ఆమె పెదవి 
దాటక ఆగిన మది మాటలు ఎన్నో...
తాను కన్న కలలన్నీ మగ అన్న 
అహంకారంలో సమాధి అవుతున్నా సరే....
మౌనమే సమాధానంగా, ఆమె పెదవి 
దాటక ఆగిన మది మాటలు ఎన్నో...
కలతను మోయలేని తన కన్నీరు 
స్వాతి చినుకులై కురిసినా సరే...
మౌనమే సమాధానంగా,
ఆమె పెదవి దాటక ఆగిన మది మాటలు ఎన్నో...
అసలు ఈ చులకనా భావం 
తగ్గేదెప్పుడో...
మౌనం వెనుక దాగిన ఆమె మది మాటలు
ఈ సమాజంలో నేగ్గేదెప్పుడో...



కామెంట్‌లు