ఆరోగ్యానికి...;- డా.నీలం స్వాతి,చిన్న చెరుకూరు గ్రామం,నెల్లూరు.6302811961.
 ఒకప్పుడు మొహం కడగడానికి పొందుం పుల్లను వాడేవారు.  వేపను కానీ,  గానుగను గాని ఆశ్రయించి  చిన్న కొమ్మను తీసుకొని  ఆరు ఏడు అంగుళాల  నిడివి కలిగిన దానిని నోటికి అందించి  ఆ చివర కొరుకుతూ  పళ్ళను శుభ్రం చేయడానికి  సరిపడినంత చేయడం వల్ల వేప అయితే చేదుగా ఉంటుంది. గానుగ అదొక రకమైన పద్ధతిలో ఉంటుంది  మనం నమిలేటప్పుడే  ఆ లాలాజలానికి అంటిన  దాని శాస్త్రీయమైన గుణం  మన నోటిలో ఉన్న  చెడు క్రిములను నాశనం చేస్తాయి. తరువాత ఆ పుల్లను ఈ చివరి నుంచి ఆ చివరకు  పై పాచి పోయేంతవరకు రుద్ది ఆ తర్వాత పైకి కిందకు  రెండు పళ్ళ మధ్య ఏదైనా చిక్కుకొని ఉన్నట్లయితే అది బయటకు వచ్చేంతవరకు  చేయాలి.
ఆ తరువాత లోపల ఉన్న  పళ్ళను కూడా శుభ్రం చేయడానికి పైనా కిందా కూడా  బాగా ఎలాంటి క్రిములు లేకుండా శుభ్రంగా ఉండేలా చూసుకోవాలి  ఈ పొందుం పుల్లలు అయిపోయిన తర్వాత  కొన్ని కుటుంబాలలో బొగ్గును  ఉప్పుతో కలిపి బాగా పొడి చేసి  దానితో ముఖాన్ని కడగడం అలవాటు చేసుకున్నారు  అంతకు ముందు మన పెద్దలు  గోపేడతో చేసిన  పిడకలను బాగా కాల్చి  అది ఆరిపోయిన తరువాత దానిని కచ్చికగా వాడే సంప్రదాయం వచ్చింది  గోవుకు సంబంధించిన  ఎలాంటి దుష్ట క్రిములను  నోటిలో ఉంచకుండా  పూర్తిగా శుభ్రం చేస్తుందని  మన పెద్దలు ఆ పద్ధతిని పాటించారు  ఈ రోజున పేస్టు వచ్చేసరికి  ఆ సంప్రదాయం కూడా మూల పడిపోయాయి  క్షణంలో ముఖం కడగడం అయిపోతుంది  దాని తర్వాత  పళ్ళ వైద్యుడు చుట్టూ తిరగడం వాళ్ల పని.
ఈ భూ ప్రపంచంలో ఏ జీవి అయినా హాయిగా ప్రశాంతంగా జీవించాలి అంటే  ముఖ్యంగా దానికి కావలసినది భోజనం  శరీరంలో ప్రతి అవయవం చక్కగా  దాని పని అది చేసుకోవాలి అంటే దానికి తగిన  భోజనం ఒక్కటే  ఇంధనం  ఒక వాహనం బయలుదేరడానికి కారణం దానిలో పెట్రోలు  అది లేకుంటే ఆ బండి కదలదు  ఆ బండి లాంటిదే ఈ శరీరం ఆ పెట్రోల్ లాంటిది భోజనం  ఆ భోజనం  ఆ రోజులలో ఎలా చేసేవారు ఈ రోజులలో ఎలా చేస్తున్నారు అనేది మనం ఒక్కసారి ఆలోచించినట్లయితే  సనాతనంగా వారు చేసిన పని సరి అయినదా మనం చేస్తున్నది సరి అయినదా  పోల్చుకుని చూసినట్లయితే  అసలు విషయం బయటకు వస్తుంది  నచ్చిన దానిని మనం ఎన్నుకొని దానిని అనుసరిస్తాం


కామెంట్‌లు