అంబేద్కర్(మణిపూసలు);- చైతన్య 7013264464
అంటరానివాడుగాను 
అంబేద్కర్ చూపబడెను 
సామాజిక విప్లవంతో
అందరివాడే ఆయెను!

తనలోని జ్ఞానార్జనం
సామాజిక అధ్యయనం
శిఖరాలను చేర్చింది
నిషితమౌ పరిశీలనం!

మేధో సంపత్తితోను 
రాజ్యాంగం సేవతోను 
అత్యున్నత స్థాయిలో 
మహనీయుడై ఎదిగేను!

బడుగులకు పూలబాట
హక్కులతో రాచబాట
జాతి పురోభివృద్ధికి 
తానెగరేసెను బావుట!

దగాకోరు మోసాలను 
కుటిలనీతి పాలకులను 
కులమతాల గజ్జినంత
కడిగేయగ పూనుకొనెను!

అవమానాల కొలిమిలో 
నిరాదరణ చీకటిలో 
మేలిమి పసిడి పుట్టుకొచ్చి 
పరిఢవిల్లెను సేవలో!

కులమతాల జాడ్యము 
కృంగదీసె బాల్యము 
పోరుసలిపి నిలబెట్టెను 
పదునైన ఆశయము!

నడయాడు విజ్ఞానం 
విస్తృత పరిజ్ఞానం
కీర్తిశిఖర మందిన 
చీకటిలొ రవికిరణం!


కామెంట్‌లు