మహోన్నత స్ఫూర్తి;- గుండాల నరేంద్ర బాబు;- చర వాణి:94 93 23 59 92
పల్లవి:
స్తీ విద్యకు పాటుపడిన ఓ మహాత్మా....
/ సమ సమాజ స్థాపనే నీ లక్ష్యమా... 

చరణం:1
ఈశ్వర చంద్ర
ప్రేరణతో ముందుకు కదిలావు /
మహిళల విముక్తికై నిత్యం శ్రమించావు/
అనాధలకై శిశు గృహాన్ని ఏర్పర్చావు/ వితంతువులకై  అనుక్షణం పరితపించావు

చరణం:2
చదువు కున్న ప్రాధాన్యతనే గుర్తించావు/
తొలి బోధకురాలిగా భార్యనే మలిచావు/ 
బాలికల పాఠశాలను తొలుత  నెలకొల్పావు/
మనుజులంత ఒక్కటేనని నినదించావు

చరణం:3

పశువు కంటె హీనంగ మనిషిని చూడకన్నావు/
మద్యపాన సేవనమే విడ నాడమన్నావు/
మూఢాచారాలపై మండే సూర్యుడయ్యావు/
మనువాదుల గుండెల్లో గుచ్చే గునపమయ్యావు

చరణం:4
బి.ఆర్.అంబేద్కర్ కే ఆదర్శ గురువయ్యావు/
మహోన్నత మూర్తివై  మాలో స్ఫూర్తి నింపావు/
మహాత్ముడై మహిలో ఆరని జ్యోతి వయ్యావు/
అందుకే....మేము
మరువబోము ఎప్పటికీ మీ ఆశయ మార్గం/ వీడబోము ఎన్నటికీ
మీ లక్ష్య సాధనం

(మహాత్మా జ్యోతిరావు పూలే జయంతి సందర్భంగా నివాళులర్పిస్తూ...)

కామెంట్‌లు