ఓం నమశ్శివాయ!;-గుర్రాల లక్ష్మారెడ్డి కల్వకుర్తి.సెల్.9491387977.నాగర్ కర్నూల్ జిల్లా.
శివ శివ యను ధనమును నేను ఆశించి
శివ స్వాము లెందరినో వేగ పోషించి
నీదు నామస్మరణ నిత్యంబు గావింతు. 
ఓం నమశ్శివాయ ఓ సలేశ్వరాయ!

శివుని పైన మనము మన మనసు పెట్టి
శివపూజకై చకచక శ్రీకారమును చుట్టి
నిత్యమై సత్యమై మదిలోన తలచిన
పుణ్యమిచ్చి మనల పులకింపజేయు !

శివుని మించిన దైవము ఇలలోన లేడు
పట్టు పీతాంబరములు అసలు లేని వాడు
గాన నిన్ను తప్ప తలుచ ఇతరుల
ఓం నమశ్శివాయ! ఓ సలేశ్వరాయ!

హిమగిరి నిలయా! నీవు మా ఇంట వెలయ
చేతులెత్తి ప్రార్ధింతు నిన్ను నేనయ్యా
నేడు ఆశీర్వదించ ఇలకు దిగిరావాలయ్య
ఓం నమశ్శివాయ! ఓ సలేశ్వరాయ!

శివ శివాయని నేను శివరాత్రి నాడు
నిద్ర తిండి మాని వినిపిస్తి నా గోడు
నిష్టతోడ నామనసు ఉండే నీ తోడు
ఓం నమశ్శివాయ! ఓ సలేశ్వరాయ!

నేనడయాడు ఈధరణియందు
నా జీవితానికి కావాలి నీ పొందు
సమసి పోవాల ఇడుముల
 రాబందు
ఓం నమశ్శివాయ! ఓ సలేశ్వరాయ!

నీ నామము ఎంతో మధురం
నిత్యం ఉచ్చరించు మాఅధరం
సత్యం పలుకుటకు మేం బెదరం
ఓం నమశ్శివాయ! ఓ మా సలేశ్వరాయ!

మ్రోగించు నీ శంఖారావం
బూడిదేగా నీకు అలంకారం
భక్తులపై ఉండు మమకారం
ఓం నమశ్శివాయ! ఓ విశ్వేశ్వరాయ!

నీ తల పైన ఉండు గంగమ్మ తల్లి
ఆ తల్లియే మా సిరి సంపదల శ్రీవల్లి
కామితముల నదించు కల్పవల్లి
ఓం నమశ్శివాయ! ఓ విశ్వేశ్వరాయ!

మూడు లోకములను పాలించు ముక్కంటి
తాడు బొంగరము లేక ఇక
 నేనుంటి
గరళ కంట వాస! కరుణాకర ఈశ
ఓం నమశ్శివాయ! విశ్వేశ్వరాయ!

లంకేశ్వరుడైన రావణాసురునికి
ఆత్మలింగమునిచ్చి ఆదుకున్నావు
ఏది అడిగితే అది ఇచ్చేటివాడవు
ఓం నమశ్శివాయ! ఓవిశ్వేశ్వరాయ 

పంచభూతములను నీవు బట్టి
బ్రహ్మాండమును నీవు నిలబెట్టి
పాలించు పరమేశ పరమ పావని ఈశా
ఓం నమశ్శివాయ! ఓం విశ్వేశ్వరాయ!



కామెంట్‌లు