శివ భక్తి;-ఏ బి ఆనంద్,ఆకాశవాణి,విజయవాడ కేంద్రం,9492811322.
 ఈ భూమి మీద ఉన్నఏ జీవి అయినా భోజనం లేకుండా బ్రతకలేరు  ఏ చిన్న పని చేయడానికి అయినా శక్తి రావడానికి మూలం భోజనం  భోజనం లేనప్పుడు ఆ బాధ ఇంత అని చెప్పడానికి వీలు లేదు  అందుకనే  మీరు  ఏదైనా దానం చేయదలచుకుంటే ముందు భోజనం ఏర్పాటు చేయండి  దానిని మించిన దానం మరొకటి లేదు. ఈ ప్రపంచంలో  ఒక పూట నీవు కడుపునిండా భోజనం పెడితే అతను జీవితాంతం నీకు రుణపడి ఉంటాను అని ఎప్పుడు కృతజ్ఞతలు చెబుతూనే ఉంటాడు. ఆ చిన్నవాడు ఆరోజు ఏదైనా పని చేసుకుని మళ్లీ భోజనం చేయడానికి డబ్బులు సంపాదించుకొని నీ పేరు చెప్పుకుంటూ సుఖవంతంగా జీవితాన్ని కొనసాగిస్తాడు ఎవరికీ డబ్బులు ఇవ్వడం వలన అది మంచి అనిపించుకోదు అని చెప్తున్నాడు వేమన మహాశయుడు. కడుపు నిండిన తర్వాత కళ కావలసి వస్తుంది  గానం చేయడానికి సామవేదాన్ని ఎన్నుకోమంటారు వేమన. నాలుగు వేదాలు ఉన్నాయని  వ్యాసమహర్షి చెబితే  కాదు ఉన్నది మూడే అది వేద త్రయి  వాల్మీకి మహర్షి కూడా  జటాయువు వేదము యొక్క మూలం నుంచి త్రిజట వరకు రామాయణం రాశాడు  త్రిజట అంటే 3 వేదముల కలయిక  కనుక గానం చేయడానికి సామగానం  దానికి ప్రత్యేకత ఏమిటంటే  దానిలో అక్షరాలు ఉండవు ప్రతిదీ స్వరం  ఆ స్వరాన్ని రాగ బద్ధం చేసి నీవు పాడుకో దలచుకుంటే  ఆ పాట ఎవరికైనా  అర్థం అవుతుంది పూరిస్తుంది వేద భాష ఎలా ఉంటుందో వాళ్లకు అర్థమవుతుంది  మిగిలిన ఏ గానంలోనూ పరిణతి లేదు  అని చెప్తున్నాడు వేమన  అనుభవంతో చెప్పిన వారి  మాటలు తప్పక ఆచరణలో పెట్టాలి. దానం గానం తరువాత కావలసినది ధ్యానం దీనికి ఎవరిని ఎన్నుకోవాలి  మీ జన్మకు కారణమైన తండ్రి నా  ఈ భూమి మీదకు వచ్చిన నీకు విద్యాబుద్ధులు నేర్పి  అనుక్షణం  నిన్ను కాచి రక్షించే తండ్రినా లేక విద్యాబుద్ధులు నేర్పి నిన్ను మంచిగా తయారు చేసిన గురువులనా. బ్రహ్మ, విష్ణు, మహేశ్వరుడు. నీవు గొప్పగా పెరగడానికి లయబద్ధంగా జీవించడానికి కారకులని మన నమ్మకం. కనుక గురువును మించిన భగవత్ స్వరూపం  శివం  లయబద్ధంగా జీవితాన్ని ప్రణాళికను సిద్ధం చేసి అలా  క్రమశిక్షణ పెంచే  తత్వం కలిగిన వాడు కనుక  వారిని తలచి ధ్యానం చేసుకోమని మనకు  సలహానిస్తున్నాడు  బ్రహ్మ విష్ణువుల కన్నా అర్ధనారీశ్వరుడైన శివుడు  నీకు సకల సౌకర్యాలు కలగ చేస్తాడు అని వేమన తెలియ జేస్తున్నాడు. ఆ పద్యాన్ని ఒకసారి చదవండి.

"దానములను యన్నదానము దొడ్డది గానములను సామగాన మెచ్చు ధ్యానములను శివునిధ్యానము శ్రేష్టము"


కామెంట్‌లు