అభ్యుదయ మేధావి;- ఏ.బి ఆనంద్,ఆకాశవాణి,విజయవాడ కేంద్రం,9492811322
 అభ్యుదయభావాలతో ముందుకు వెళ్లే కుటుంబంమాది.  స్వాతంత్ర్య సమర వీరునిగా  జైలు నుంచి బయటకు వచ్చిన తర్వాత మా నాన్న (ఆరుమళ్ల సుబ్బారెడ్డి) గాంధీ గారి సిద్ధాంతాలను అనుసరించి  మాల మాదిగ అన్న విచక్షణ లేకుండా ప్రతి ఒక్కరిని మన సొంత కుటుంబంలా చూడాలని ప్రతి ఒక్కరికి మా గ్రామంలో ఉన్న  దేవాలయాలలో ప్రవేశం ఉండాలని వాదించి వారి అందరిని తీసుకువెళ్లి  దైవ దర్శనం చేయించారు.  మూఢనమ్మకాలను నమ్మే అలవాటు లేదు  అనేకమంది  వితంతువులకు పునర్వివాహం చేశారు. కొండపల్లి సీతారామయ్య గారికి  వితంతువును చూసి వివాహం చేశారు  అలాంటివి మా గ్రామంలో మా పరిసర ప్రాంతాలలో చాలా చేయించారు. మాకు ఏ కులం మతం పట్టింపులు లేవు  నా పేరును కూడా  కులానికి సంబంధించిన పేరుని తీసివేసి  మామూలుగానే పెట్టుకున్నాను.
ఉన్నత పాఠశాలలో చదివేటప్పుడు కళాశాలలో చదివేటప్పుడు  నా స్నేహితులందరూ కూడా మాల మాదిగ ఎరుకల ఉప్పర  కుటుంబీకులే  నేను వేసే నాటకాలు కూడా వాటికి సంబంధించినవే. సుంకర సత్యనారాయణ గారు నాకు బాగా సహకరించేవారు  రచయితగా. నేను ఆకాశవాణిలో  ఉద్యోగిగా చేరిన తరువాత  మరింత పరిచయం చేయడానికి అవకాశం కలిగింది. అనేక మంది పెద్దలతో చర్చించే అవకాశం  నాకు మా కేంద్రం ద్వారా లభించింది  జాతకాలు చెప్పే ఒక ఆత్మీయ మిత్రుడు నాకు  దగ్గరయ్యారు  వయసులో నాకన్నా చిన్నవాడు బాగా సాముద్రికం  అధ్యయనం చేసిన వారు  జాతకాలు చెప్పడంలో కానీ  ఎక్కడ బావి ఉండాలో చెప్పడం  వాస్తు ప్రకారం ఇళ్ళని నిర్మాణం ఎలా చేయాలో తెలియజేయడం  వారి వృత్తి. నేను కళాశాలలో ఉన్నప్పుడే  కెరో రాసిన పుస్తకాలను చదివాను.  కొంచెం ఆ జ్ఞానం ఉండడంతో  మా స్నేహం మరింత బలపడింది. వారు చెప్పినది తూచా తప్పకుండా జరిగేది  తాను గ్రహాలపై ఆధారపడకుండా  చేతి గీతలను సాముద్రికతని మాత్రమే ఎక్కువగా చూస్తూ ఉండడం నేను గమనించాను  మధ్యలో ఒక  మిత్రుడు కలిసి  ఉప్పలపాడు అనే గ్రామం  గుంటూరు తెనాలి వెళ్లే మార్గంలో ఉంది  అక్కడ ఒక జ్యోతిష్యుడు  ఉన్నాడు వారు చెప్పిన ప్రతి మాట నిజంగా జరుగుతున్నాయి. వెళ్ళిన వారి పూర్వ చరిత్రను ప్రస్తుత చరిత్రను  రాబోయే భవిష్యత్తును గురించి చాలా చక్కగా చెబుతున్నారు  వారిని ఒకసారి  గమనిస్తే మీ స్నేహితుడిని  మించిన వాడు అని మీరే ఒప్పుకుంటారు. మీకు వీలున్నప్పుడు చెప్పండి ఇద్దరం కలిసి వెళ్దాం మిమ్మల్ని నేను పరిచయం చేస్తాను అన్నారు.


కామెంట్‌లు