నిత్యజీవితంలో యోగం అనే శబ్దానికి అర్థం చాలామంది తనకు కాలం కలిసి వచ్చి అనేక రకాల మంచి జరిగే స్థితి ఆస్తిపాస్తులు కలిసి రావటం కానీ ఉద్యోగంలో ఏదైనా ప్రమోషన్ కానీ, జీవితంలో ఏదైనా మంచి జరగడాన్ని యోగం అని వ్యవహరిస్తున్నాం యోగి ఎవరైతే ఉన్నారో అతను చేసేది యోగము అన్న విషయాన్ని మర్చిపోతున్నాం. మనిషికి తానున్నది భూమి మీద తనకు కనిపిస్తున్నది ఆకాశం ఇది మన్ను అది మిన్ను ఇది తప్ప మరొక దాని గురించి ఆలోచించడు. అసలు ఈ తనువు ఎలా ఉద్భవించింది దీనికి మూలకారపులెవరు ఒక స్త్రీ ఒక పురుషుడు భౌతికంగా సంగమించినందువల్ల సంతాన ఉత్పత్తి జరుగుతుంది అన్న విషయం చంటి పిల్లవాడికి కూడా అర్థమవుతుంది కానీ అంతరార్థం తెలుసుకోవడం యోగం. తాను అన్న శబ్దాన్ని వెతికి వెతికి ఎప్పుడైతే నీవు అర్థం చేసుకోవడానికి ప్రయత్నించావో అదే సజీవం జీవపదార్థం అన్న విషయం అర్థం అవుతుంది జీవుడే తత్వము అన్న విషయం నీకు తెలిస్తే రెంటికి తేడా లేదు రెండు ఒకటే అటు భగవత్వరూపం ఇటు మానవ శరీరం భక్తుడు అంటూ ఇద్దరు మనకు కనిపించరు ఉన్నది ఒక్కడే అన్న విషయం నీకు స్పష్టంగా తెలిస్తే అంతకుమించిన గొప్ప వేదాంత రహస్యం మరొకటి ఉండబోదు యోగులు తపస్సు చేసి తెలుసుకొనే విషయం అదే అన్నది నీవు తెలుసుకున్నట్లయితే అద్వైత సిద్ధికి వెళ్లి జీవితం జీవం అంటూ వేరువేరుగా లేవు అన్న విషయం చాలా స్పష్టంగా నీకు అర్థం అవుతుంది అని చెప్తున్నాడు వేమన వారు అనుభవంతో చెప్పిన మాట ఇది. ముందు తత్వం అనే శబ్దానికి అర్థం తెలుసుకోవాలి ఏదైతే శాశ్వతంగా ఉంటుందో అది నేను అన్న విషయం నీకు ఆలోచన వస్తే దాని మూలానికి వెళ్ళిపోతావు ఈ ప్రపంచంలో నడుస్తూ మాట్లాడుతూ తనకు కావలసిన పనులను చేస్తూ ఉన్న ఈ శరీరం నామ మాత్రమే దీనిని నడిపిస్తున్నది నీతో అన్ని పనులు చేయిస్తున్నది నీలో అంతర్గతంగా ఉన్న ఆ బ్రహ్మ స్వరూపం. ఆ ఆత్మ ఎప్పుడైతే నీకు అర్థమవుతుందో అప్పుడు ఈ మన్ను మిన్ను బంధువులు స్నేహితుడు కట్టుకున్న భార్య కన్న సంతానం ఏ ఒక్కరూ నీకు గుర్తుకురారు ఉన్నది అహం తప్ప మరొకటి కాదు అని తెలుసుకున్న జీవులు జీవన్ముక్తుడు కావడానికి అవకాశాలు నిండుగా ఉన్నాయన్న విషయాన్ని వేమన తన పద్యంలో రాశాడు చదవండి.
తన్ను వెదకి చూడ దానెపోజీ వుండు తత్వమరసి చూడదానె ఆత్మ మన్ను మిన్ను లేదు మాయతాలేదయా..."
తన్ను వెదకి చూడ దానెపోజీ వుండు తత్వమరసి చూడదానె ఆత్మ మన్ను మిన్ను లేదు మాయతాలేదయా..."

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి