ఏరు దాటే వారు;- ఏ బి ఆనంద్,=ఆకాశవాణి,విజయవాడ కేంద్రం,9492811322
 ఏరు దాటి తెప్ప తగలబెట్టారు అన్న సామెత మన పెద్దవాళ్ళు మనకు చెబుతూ ఉంటారు  అది ఎందుకు జరుగుతుంది ఎలా జరుగుతుంది  అసలు ఈ సామెత రావడానికి కారణా  లు ఏమిటి  అని ఆలోచించినట్లయితే  మానవులలో రెండు రకాల తత్వాలు ఉన్న వాళ్ళు ఉన్నారు  సమాజంలో ఉంటున్నాం కనుక సమాజానికి మంచే చేయాలి అన్న అభిప్రాయంతో  ఏ సంకల్పం చేసినా మంచి చేయడం  కొంతమంది అలవాటు  కొంతమంది ఉంటారు  తన ఇంట్లోనైనా బయట అయినా ప్రతి దాన్ని పాడు చేయటం అతని అలవాటు  ఒక కాలువ దాటడానికి  ఒక మంచివాడు అక్కడ వరకు వచ్చి అక్కడ తెప్ప ఉండడం చూసి ఇది అందరికీ ఉపయోగపడుతుంది అని దానిని ఉపయోగించుకుని ఆ ఒడ్డు చేరతాడు. రెండవ తత్వం కలిగిన వ్యక్తి కూడా అదే పరిస్థితిలో  ఆ నది దాటి అవతల తీరానికి వెళ్లిన తరువాత  ఇది నాకు పనికి వచ్చింది కదా ఇతరులకు ఎందుకు పనికి రావాలి  వాడు ఈత కొట్టుకుంటూ రాలేడా  వాళ్లకు ఈ తెప్ప ఎందుకు అన్న దురుద్దేశంతో  దురాలోచనతో దానిని కాల్చివేస్తాడు  ఉన్న వస్తువులను పాడు చేసే దుర్బుద్ధి  పుట్టుకతోనే కొందరికి వస్తుంది అనడంలో  ఇదొక ఉదాహరణ మాత్రమే  దీనిని ఒక యోగికి సమన్వయపరచుకుంటూ  వేమన ఒక మంచి ఆటవెలదిని మనకు అందించారు  యోగానికి కూర్చోవడానికి ముందు తాను సామాన్య వ్యక్తి  ఈ జీవితం భౌతికం  ఈ స్థితి దాటిన తర్వాత నేను ఏం చేయాలి  ఎక్కడకు వెళ్లాలి నా గమ్యం ఏమిటో నాకు తెలుస్తుందా తెలియదా  అన్న ఆలోచనకు వచ్చి విషయ సేకరణ కోసం పెద్దలను తెలిసిన వారిని సంప్రదించి  ఆ యోగం ఏదో నేర్చుకొని ముక్తిసాధనకు తన జీవితం అంతా సాధన చేసి మోక్షాన్ని పొందటానికి ప్రయత్నించడం కూడా  అలాంటి యోగులకు ఈ శరీరం పైన ఎలాంటి ఆశలు  ఎలాంటి కోరికలు ఉండవు  తాను తపస్సులో కూర్చున్న తర్వాత అనేక రకాల క్రూర జంతువులు  తనను కుట్ట దానికి వచ్చిన  విష జంతువులు పాము తేలు లాంటివి  వచ్చినా అతనికి పట్టదు  ఈ తపస్సును భంగం చేయడానికి  రంభ ఊర్వసి త్రిలోత్తమ లాంటి వాళ్ళు వచ్చి తన ఎదుటగా నృత్యం చేస్తూ ఉన్నా  ఆ యోగికి పట్టదు  అలా తదేకంగా  నిశ్చల దృష్టితో కనుక తపస్సును ముగించినట్లయితే  అతను తప్పకుండా మోక్షాన్ని పొందుతాడు అని చెప్తున్నాడు వేమన  ఆ పద్యాన్ని ఒకసారి చదవండి.
"ఏరు దాటి మెట్టకేగిన పురుషుడు  పుట్టి సరకు గొనకు పోయినట్లు యోగ పురుషుడేల యొడలు బాటించురా..." 



కామెంట్‌లు