ధన్య జీవి;- గుండాల నరేంద్ర బాబుహస్త వాణి:9493235992
పల్లవి:
అడు గడుగో... అఖండ మార్తాoడ తేజం

అది గదిగో...అభాగ్యుల
అభయ హస్త రూపం 
 
అడు గడుగో అజేయ  ఆత్మ గౌరవ సంకేతం
  
అసమాన మేధస్సుకు నిలువెత్తు రూపం 


చరణం:1

బహుజనుల నవ చైతన్య ధ్వజ స్తంభం

బానిస సంకెళ్ళ బంధ విముక్త మూర్తిమత్వం

సర్వజన సంక్షేమమే అంతిమ లక్ష్యం

సకల జనుల సమభావనే తన ధ్యేయం

అణగారిన ప్రజలకి     
ఆరాధ్య దైవం 

అస్పృశ్యత అంతానికి అతడొక సైన్యం   


చరణం:2

సమ సమాజ స్థాపనే   మనోగతం

సమతా మమతల  సాధనే  సమ్మతం 

అకుంఠిత దీక్ష దక్షతలే తన బలం 

అలుపెరుగని పోరే  జీవన పర్యంతం 
 
జన జాగృతికే తన కలం కరవాలం

జన చైతన్య శీలతయే తన గళం
 
చరణం:3

పూరించారు ప్రతి నిత్యo సమర శంఖం

రగిలించారు అను క్షణం ఆత్మాభిమానం

సారించారు అసమానతలపై ఉగ్ర నేత్రం

చూపిoచారు
అభాగ్యులపై దయార్ద్ర హృదయం

అయ్యారు
మనువాదుల పాలిట సింహ స్వప్నం

అయ్యారులే 
అన్నార్తుల ఆత్మీయ నేస్తం 

చరణం:4
అడుగడుగునా నిండెను అనంత త్యాగ భావం

అణువణువున పొంగెను అత్యున్నత మానవత్వం

అత్యద్భుత ప్రతిభా పాటవ  నిదర్శనం 

నవభారత రాజ్యాంగమే సజీవ సాక్ష్యం

భరత జాతిలో తను అగ్రశ్రేణి ఆణిముత్యం  

విశ్వ విఖ్యాతి గాంచిన అనర్ఘ  జాతి రత్నం

అతడే అతడే డాక్టర్ బి.ఆర్.అంబేడ్కర్ 

నీల్ సలామ్..  నీల్ సలామ్.. నీల్ సలామ్.. నీల్ సలామ్.. 
నీల్ సలామ్.. నీల్ సలామ్....
జై భీమ్.. జై భీమ్ ..జై భీమ్..
జై భీమ్.. జై భీమ్ ..జై భీమ్......

(14  ఏప్రిల్ 
డాక్టర్ బి.ఆర్.అంబేడ్కర్ గారి జయంతి సందర్భంగా)




కామెంట్‌లు