ఏ ఇంటనో నట్టింట మహాలక్ష్మి గా నడయాడిన ఆడపిల్ల చిరునవ్వుల సందడితో కన్న వారిని ఉన్న ఊరిని వదిలి అర్దేచ ,కామేచ, మోక్షేచ నాతిచరామి అన్న మగాడి మాటలను నమ్మి మంగళకరమైన సూత్రముతో మంగళ వాయిద్యాల నడుమ పెద్దనాల పెద్దల దీవెనలతో వేసే మూడుముళ్ల బంధాన్ని అనుబంధంగా మార్చుకుని కలకాలం జీవించే సంబంధం
*ఆలుమగలు*
ఆదిదంపతు ఏకశరీరులై దాంపత్య
బంధం ఎంత గొప్పదో తెలిపిరి
స్థితి కారకుడు తన హృదయాన్ని
కోవెలగ మలిచే
బ్రహ్మ సరస్వతిని నాలుక పై నిలిపే
సతీ సావిత్రి యముడితో పోరాడే
నేటి యువతకు పెళ్లి ముళ్ళబంధమల్లె తోస్తున్నది
డేటింగ్,లివింగ్ రిలేషన్ అంటూ
మంగళసూత్రాన్ని అమంగళం చేస్తున్నారు
ఆచార ,సాంప్రదాయాల సునిశిత
సూత్రాలను వివరించి పెళ్లిని పెటాకులు
కానీక,పారాణి ఆరకముందే,మావిడాకులు వాడకముందే విడాకుల కు
వెళ్ళనివ్వక..బంధంలో అపశృతులు
పలకనివ్వక, సంసారం సరాగాలతో పరిడవిల్లేలా ప్రతి తల్లిదండ్రి కృషిచేయాలి

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి