నీవునేర్పిన విద్యయే నీరజాక్ష.;- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు.చెన్నయ్.988442989

  సుందరయ్య అమాయకుడు,చదువులేనివాడు . తనకుమారులు రామడు,లక్ష్మణుడులను బాగాచదివించాలని ఆశతో వారిని పట్టణంలో  ఉంచి ఉన్నత విద్య చదివించసాగాడు.పొరుగు ఊరులోని వడ్డివ్యాపారి రంగనాధం వద్ద పలు కాగితాలపై వేలముద్రలు వేసి డబ్బు అప్పుతీసుకున్నాడు.మూడేళ్ళలో సుందరయ్య పిల్లల చదువులు ముగిసాయి.ఈలోపు వడ్డివ్యాపారి రంగనాధం,సుందరయ్య పొలం కొన్నానని స్వాధినపరుచుకున్నాడు. 
రాముడికి మంచి జీతంతో ప్రభుత్వ ఉద్యోగం లభించింది.లక్ష్మణుడు తండ్రికి తోడుగా కౌలు పొలంలో కాయగూరలు సాగుచేయసాగాడు.మెదటి నెల జీతం అందగానే తండ్రికి డబ్బు ఇచ్చివెళ్ళాడు  రాముడు. అందులో కొంతడబ్బు,పొలంలోని కొన్నిరకాల కూరగాయలు, తీసుకుని వడ్డివ్యాపారి ఊరు బయలుదేరివెళ్ళిన లక్షణుడు ముందుగా ఆగ్రామ పెద్ద ఆగ్రామ పెద్ద పూర్ణయ్య గారి ఇంటికి వెళ్ళి''నమస్కారం అయ్య మాది పొరుగుగ్రామం. తమ ఇంటి ఎదురుగా ఉన్న వడ్డి వ్యాపారి రంగనాథం వద్ద ఈమాసంనుండి పదివేలు దాచుకుందామని వచ్చాను''  (అని డబ్బు చూపించి).దారిలో తమవంటి పెద్దల ఆశీర్వాదం పొందాలని వచ్చాను".అని కూరగాయలుఉన్న బుట్ట అక్కడ ఉంచాడు. నమస్కరించాడు.
"నాయనా రంగనాథం తో డబ్బువిషయంలో జాగ్రత్త ''అన్నాడు పూర్ణయ్య "అలాగే" అని రంగనాథం ఇల్లు చేరి "నమస్కారం అయ్య నాపేరు లక్ష్మణుడు.మాది పొరుగుఊరు ఇవి మాపొలంలో పండినవి ఈకూరగాయలు ఉంచండి. భవిష్యత్తులొ తమవద్ద డబ్బు అవసరం పడవచ్చు అందుకని తమదర్శనం చేసుకుందామని వచ్చాను" అన్నాడు."మంచిది వెళ్ళిరా" అన్నాడు రంగనాథం.
అలా ప్రతి మాసం  పూర్ణయ్యగారికి, రంగనాథం గారికి కాయగూరలు క్రమంతప్పకుండా సంవత్సర కాలం అందించాడు లక్ష్మణుడు.  ఓక రోజు రంగనాథం ఇంటిముందు జనం గుంపులు గుంపులుగా ఉన్నారు. రంగనాథంతో, లక్ష్మణుడు తగాదా పడుతున్నాడు. "పోవయ్య ఫో నువ్వేంటి సంవత్సరకాలంగా నావద్ద డబ్బుదాయడం ఏమిటి? ఫో" అన్నాడు ఆవేశంగా రంగనాథం."అన్యాయం ప్రతిమాసం పదివేల రూపాయలు,కాయగూరలు, మీకు ఇచ్చివెళ్ళాను" అన్నాడు లక్ష్మణుడు.అక్కడ ఉన్నజనంలో కొందరు "అబ్బాయి అందుకు సాక్ష్యం ఉందా" అన్నారు. "ఉంది రంగనాథం గారికి డబ్బు,కూరగాయలు ప్రతిమాసంఇస్తూ,వారి ఇంటి ఎదురుగా ఉన్న పూర్ణయ్య గారికి ప్రతిమాసం కనిపించి నమస్కరించే వాడిని" అన్నాడు లక్ష్మణుడు.
తన ఇంటి ముందునిలబడిన పూర్ణయ్యగారు" అవును ఇతను ప్రతిమాసం మాయింటికి వచ్చేవాడు,అనంతరం రంగనాథం ఇంటికి వెళ్ళేవాడు, రంగనాథం దగ్గర దాచడినికి తెచ్చిన ధనం ప్రతిమాసం నాకు చూపించేవాడు. రంగనాథంగారు ఇది మీకు తగదు ఇతను ప్రతి మాసం మీవద్ద డబ్బు దాయకుండా,మీకు ఊరికే కూరగాయలు ఇవ్వడానికి అంతదూరంనుండి వచ్చేవాడా? మీప్రవర్తనపై ఇప్పటికే చాలా ఫిర్యదులు ఉన్నాయి మర్యాదగా అతని డబ్బు ఇచ్చి పంపండి"అన్నాడు పూర్ణయ్య. వేరేదారిలేని రంగనాథం అందరిముందు లక్ష్మణుడికి ధనం ఇచ్చి పంపాడు.
రంగనాథం ద్వారా కోల్పోయిన తమభూమికి సమంగా డబ్బు తండ్రి సుందరయ్యకు అందించాడు లక్ష్మణుడు. 
9.

కామెంట్‌లు