"భారత రత్న" అంబేద్కర్! ; - శంకర ప్రియ., శీల., సంచార వాణి: 99127 67098
 🪷 "భారత రత్న" అంబేద్కర్! 
 సమతావాది అంబేద్కర్! 
       భారతీయ ఆధ్యాత్మిక 
 తత్త్వ చింతనా పరుడు! (1)
🪷అణగారిన బ్రతుకుల 
ఆశాజ్యోతి! శాంతిదూత! 
      అందరివాడు! నిగర్వి! 
అంబేద్కర్ మహాశయుడు (2)       
           ( అష్టాక్షరి గీతి,, శంకర ప్రియ., )
👌 డా. బి. ఆర్. అంబేద్కర్.. భరతమాత ముద్దు బిడ్డలలో.. సుప్రసిద్ధుడు! మన భారత రాజ్యాంగ నిర్మాత! "భారత రత్న" పురస్కార గ్రహీత! భీమారావు.. ఒక వర్గమునకు.. ఒక కులమునకు.. సంబంధిoచిన వ్యక్తి కాదు! ఒక మహా దివ్యశక్తి! అందరివాడు! దేశ ప్రజల అవసరాలను.. హక్కులను.. బాద్యతలను.. తెలిపిన "అకళంక దేశభక్తుడు"! అణగారిన జాతుల ఉద్ధరణకు కంకణం కట్టుకున్నాడు.
👌 మన భారత దేశంలోని.. విభిన్న మతములైన.. శైవం.. వైష్ణవo.. శాక్తేయం.. గాణాపత్యం.. సౌరం..  బౌద్దం.. మున్నగు వాటిని, అధ్యయనం కావించాడు! ఆయా సిద్ధాంతముల ముఖ్యాంశంములను రాజ్యాంగము నందు పొందుపరిచాడు! మన సనాతనధర్మ పరిరక్షణకు "శ్రీకారంచుట్టిన మహా మనీషి".. అంబేద్కర్ మహాశయుడు! 
        🚩 సీస పద్యము🚩 
      ఎవ్వాని కంఠంబు నేవేళ వినినంత, సమసమాజ పదమ్ము స్మరణయగును 
        ఎవ్వాని సత్కృషి నెచ్చోట గాంచినా 
దళితుల  బ్రతుకులు  తళుకులీను, 
      ఎవ్వాని చట్టంబు నేదేని తలచినా, 
బడుగు వర్గంబుల బాగుగోరు! 
        ఎవ్వాని వ్రేలును యెత్తిచూపిన యంత, తాత్విక చింతన దర్శనమగు 
               (🚩తేటగీతి:) 
      ఎవని స్వరము భాస్వరములా యెపుడు మండు 
       ఎవని ధైర్యమ్ము దివిటియై యవని వెలుగు 
       భరతమాతకు నత్యంత ప్రముఖు డెవరు? 
        "విశ్వవిఖ్యాత మాన్యు డంబేద్కరుండు"! 
          ( రచన: డా. అయనాల మల్లేశ్వర రావు.,)

కామెంట్‌లు