మైండ్ లోనే బ్లాక్ బోర్డు ఉండాలి!!?;- ప్రతాప్ కౌటిళ్యా
 ప్రాచీన వేద విద్య మొదలుకొని ఆధునిక విద్యా విధానం వరకు మనం అలవాటు పడ్డ విద్యా విధానం లేదా నేర్చుకునే విధానం, మొదట బట్టి పట్టడం అంటే కంఠస్థం చేయడంతో మొదలుకొని మళ్లీ మళ్లీ వేయడం వలన నేర్చుకునే వాళ్ళం. కానీ రాను రాను వినడం వలన ఆ తర్వాత చూసి చదవడం వలన రాయడం వలన విద్యను భాషను కానీ శాస్త్రాన్ని గాని నేర్చుకునే వాళ్ళం. ఈ మూడు ప్రక్రియల వలననే, ప్రయోగాత్మక విద్య కానీ థియరిటికల్ చదువును కానీ నేర్చుకొనుటకు నేర్చుకున్నాము. కానీ ఇప్పుడున్న చదువు మొత్తం ప్రయోగాత్మకమైనదే కావడం వలన ప్రయోగాత్మకంగా చేస్తూ నేర్చుకుంటున్నాం. ఇది విద్యను నేర్చుకునే రకంలో రెండవ దశ.
అంటే ప్రయోగాత్మక విద్యను అనుభవం ద్వారా మాత్రమే నేర్చుకుని తర్వాత శాస్త్రీయంగా తర్వాత తరాలకు అందిస్తున్నాం. ఇది అతి ప్రాచీన విద్యకు కొంత మెరుగ్గా ఆత్యాధునిక విధానంగా భావించవచ్చు. ఏదేని విద్యను నేర్చుకునే విధానంలో ఇది చాలా ప్రముఖ ప్రక్రియగా ప్రపంచం ఒప్పుకుంది. ప్రయోగాత్మక విద్యలో శాస్త్రీయ పలితాలు రాబట్టడమే కాక ఒకే పనిని ఎన్నిసార్లు చేస్తే అంత అనుభవాన్ని సంపాదిస్తూ, అనుభవమే నైపుణ్యాలుగా మారుతున్నట్టు తెలుసుకుంటున్నాం. ఇది కీలకమైన మార్పుగా చదును నేర్చుకునే దశగా మనం భావించాలి. ఒకే పనిని చేస్తూ చేస్తూ దానిలోని లోపాలను లాభాలను మాత్రమే కాక నైపుణ్యాలను పొందుతున్నాం.
ఈ రకంగా చదువును నేర్చుకునే విధానాలు రాను రాను మారుతున్న క్రమంలో మూడో రకమైన క్రమమే మనల్ని అత్యంత ప్రతిభావంతులుగా నిపుణులుగా మారుస్తుంది. ఇప్పుడు చదువు మారుతున్న క్రమంలో ప్రస్తుతం శాస్త్ర సాంకేతిక యుగంలో మన చదువుకు ఇప్పుడు కంప్యూటర్ వచ్చి చేరింది. కనుక పలక బలపం పట్టుకుని నేర్చుకునే విధానంలో నుంచి కంప్యూటర్ ని నేర్చుకునే అంశం మారిపోయింది. అంటే మనము ఇంతకుముందు చదువు నేర్చుకున్న విధానాలతో కంప్యూటర్ను డిజిటల్ విద్యను నేర్చుకోలేకపోతున్నాం. అవన్నీ పాత పద్ధతులుగా మారిపోయినవీ. ఇప్పుడు చదువు అంటే కంప్యూటర్. ప్రాథమిక విద్యా స్థాయి నుంచి మాస్టర్ స్థాయి వరకు కంప్యూటర్ డిజిటల్ నాలెడ్జి వచ్చి చేరింది. కనుక దీనిని నేర్చుకునే విధానం కూడా మారింది. వినడము చూడడం ప్రయోగాత్మకంగా చేయడం అనే విధానం ద్వారా దీనిని నేర్చుకోలేము. అంటే డిజిటల్ నాలెడ్జిని నేర్చుకునే విధానము మారిపోయిందని గమనించాలి. డిజిటల్ నాలెడ్జ్ పొందాలంటే యాక్సెస్ ద్వారా మాత్రమే పొందగలం. దీంట్లో నైపుణ్యాలను పొందడానికి మన పాత విద్యా విధానం పాత పద్ధతులు పాత జనరేషన్ కచ్చితంగా కన్ఫ్యూజ్ అవుతుంది.. ఎందుకంటే మనం ఇంతకుముందు నేర్చుకునే విధానంలో బ్లాక్ బోర్డు క్లాస్ రూమ్ లో బయట ఉండేది. ఇప్పుడు బ్లాక్ బోర్డు క్లాస్ రూమ్ లో కాదు మన మైండ్ లో ఉండాలీ.
 అంటే ఇప్పుడు నీవు నేర్చుకునే ది కేవలం నీ మైండ్ లోని బ్లాక్ బోర్డు పైనే కానీ బయటి బ్లాక్ బోర్డ్ పై కాదు. అంటే నీకు డిజిటల్ నాలెడ్జి నేర్పించే టీచరు బ్లాక్ బోర్డ్ నీ మైండ్ లోనే ఉంటుందని గమనించాలి. ఇది ఇంతకుముందు కూడా పూర్తిగా విరుద్ధంగా నేర్చుకునే విధానం కావడం వలన మనం కన్ఫ్యూజ్ అవుతున్నాం. యాక్సెస్ వల్లనే నేర్చుకునే ఈ డిజిటల్ నాలెడ్జిని నాలెడ్జిని కేవలం మైండ్ యాక్సెస్ తోనే సాధ్యం. ఇది చాలా సులువు అయింది. కానీ తరతరాలుగా మనం నేర్చుకునే విధానానికి దీనికి చాలా తేడా ఉండటం వలన ఒక్కసారిగా చదువు నేర్చుకునే విధానం మారడం వలన గ్రామీణ విద్యార్థులు కొద్దిగా కన్ఫ్యూజ్ అవుతున్నారు. డిజిటల్ యాక్సెస్ కోసం పెద్దగా కష్టపడనవసరం లేదు. దీన్ని నేర్చుకునే సులువైన విధానం ఈ తరానికి ఇంకా అంతు పట్టడం లేదు. కానీ కంప్యూటర్ ని బేసిక్స్ తో ప్రారంభిస్తే డిజిటల్ నాలెడ్జి కోసం యాక్సెస్ మాత్రమే కీలకమైంది. దీన్ని అధిగమించడానికి ప్రయత్నిస్తుండడమే ప్రధానమైన విధానంగా మనం భావించాల్సి ఉంటుంది. కనుక నిపుణులు ఇప్పటి ఈ చదువును నేర్పించేందుకు కొన్ని కొత్త పద్ధతులు కొత్త మార్గాలు కనిపెట్టాల్సిన అవసరం ఉంది. లేదా పుట్టిన ప్రతి పిల్లనికి చరవాణినిచ్చి తర్వాత బాల్యంలో కంప్యూటర్నిచ్చీ ఆ తర్వాత ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్ ఉపకరణాలు ఇచ్చి శిక్షణ ఇవ్వాల్సిన అవసరాలను గమనించాలి. కనుక ఒక భాషను నేర్పించడానికి ఎట్లా పద్ధతులను పాటిస్తామో డిజిటల్ నాలెడ్జి నేర్పించేందుకు విధివిధానాలను పద్ధతిని కనిపెట్టాల్సిన అవసరాన్ని గమనించాల్సిందిగా నిపుణులు ఆలోచించాలి.
Dedicated to Ramesh
Pratapkoutilya lecturer in Bio-Chem palem nagarkurnool dist 🙏
8309529273

కామెంట్‌లు