సునంద భాషితం ;-వురిమళ్ల సునంద, ఖమ్మం
 న్యాయాలు -103
దుర్జన మశక న్యాయము
*****
దుర్జనుడు అంటే దుష్టుడు దుర్మార్గుడు నీచుడు, తులువ,దురాత్ముడు దుర్వర్తనుడు అనే అర్థాలు ఉన్నాయి. మశకము అంటే దోమ.
దుర్జనుడు దోమతో సమానుడు, దోమను పోలిన వాడు అనే అర్థంతో ఈ దుర్జన మశక న్యాయమును ఉదాహరణగా చెబుతుంటారు.
దోమ అతి చిన్న ప్రాణి. అది పులిలా గాండ్రించదు.సింహంలా గర్జించదు.పాములా బుసకొట్టదు.ఇవన్నీ చాలా కౄరమైనవి.అయినప్పటికీ  వాటి జోలికి వెళ్ళనంత వరకు మనకేం ప్రమాదం లేదు.కానీ దోమ అలా కాదు.మన ఇంటి చుట్టూ తచ్చాడుతూ లోపలికి వచ్చి మరీ కుడుతుంది. ప్రపంచంలోనే అత్యంత ప్రమాదకరమైనది దోమేనని శాస్త్రవేత్తల పరిశోధనలో తేలిందట.
దానికి మనతో దోబూచులాటలాడటం వెంటాడి, వేటాడి బాధించడం చాలా సరదా.
దీనికి  ఉదాహరణగా వ్యాఖ్యాతల రామకృష్ణ గారు  అనే కవిగారు చక్కని పద్యాన్ని రాశారు. అదేమిటంటే...
"కానరాక డాగ; రానీక చెంతకు/ దోలి తోలి కొట్ట; గూల నడచ/ సందు లెమకి యెటులొ సాధించు బాధించు/ దోమ యౌర! తులువ రామ కృష్ణ!"
అంటే దోమను మన దగ్గరకు రానివ్వకుండా చేతులతో ఎంత తోలి తోలి వెళ్ళగొట్టినా మన కంటికి కనీకనబడకుండా మన చుట్టూ చేరి ఎక్కడ వీలు పడుతుందో  సందు గొందులు వెతుక్కుని  అక్కడ కుట్టి బాధిస్తుంది.
దోమ చిన్నదైనా మామూలుది కాదు  మనల్ని కుట్టి రక్తం పీల్చే దాకా వదలదు.అందుకే ఈ శతక కర్త  దోమను దుష్టుడితో పోల్చాడు.
అది చెవి దగ్గర చేరి బుయ్యిమని రొద చేస్తూ ఎంత చిరాకు పెడుతుందో ఆ బాధ పడిన మనందరికీ తెలుసు.
 పానుగంటి లక్ష్మీ నరసింహారావు గారు అనగానే సాక్షి వ్యాసాలు గుర్తుకు వస్తాయి. 
వారు ఓ వ్యాసంలో  దోమల గురించి  ఎలాంటి హాస్యాన్ని ఎలా పండించారో చూద్దాం.
మనం దోమల్ని తిట్టుకున్నట్టు గానే అవి అంతకంటే  భయంకరంగా మనల్ని తిట్టుకుంటూ ఓ సభ పెట్టుకున్నాయట. నరులు తమ జాతిపై చేస్తున్న దాడుల గురించి ప్రస్తావిస్తూ ఇలా అన్నాయట.
" నరజాతి యంతటి తుచ్ఛజాతి ప్రపంచంలో మరొకటి లేదు.నరుడు మనకు శత్రుడు.... తానే మహా వీరుడు! వీరాధి వీరుడట... వీని గర్వము కాలిపోను! పిరికిపందల్లో అగ్రగణ్యుడెవ్వడు? నరుడు....దోమ కరచిపోవునేమోనని సాయంకాలమగుసరికి సన్నని గుడారములో దూరిన వాడు వీరుడా?... ఇలా దోమలు మన గురించి అనుకున్నాయని రాసిన వ్యంగ్య రచన చదివినప్పుడు నవ్వుకోకుండా వుండలేం.
అది సరదాగా కాసేపు నవ్వుకోవడానికే కానీ  దోమ ఎంత ప్రమాదకరమైనదో అది ఎన్ని రకాల జబ్బులను కలిగిస్తుందో తెలుసు.
మన చుట్టూ దోమల్లాంటి  వ్యక్తులు కూడా అప్పుడప్పుడూ తారస పడుతూ ఉంటారు. వారు ఇతరులను పెట్టే ఇబ్బంది  మామూలుగా ఉండదు.అనేక రకాలుగా నష్ట పరుస్తూ ఉంటారు.మనసునూ, మనిషిని ప్రశాంతంగా ఉండనీయరు.
దోమలాంటి దుర్జనులు చెంత చేరారంటే వాళ్ళ వల్ల వచ్చే అనర్థాలు అన్నీ ఇన్ని కావు. శారీరక,మానసిక, ఆర్థిక ఇబ్బందులు రావడం తథ్యం.
 దోమతెర,ఆలౌట్, ఒడొనిల్ లాంటి వాటితో దోమల బారి నుండి కొంతైనా తప్పించుకోవచ్చునేమో కానీ...
దోమలాంటి దుర్జనుడు తారస పడితే అంత తొందరగా వదిలించుకోవడము  కష్టం.
 కాబట్టి అలాంటి వ్యక్తులను పసిగట్టి సాధ్యమైనంత దూరంగా ఉండటమే కాకుండా చాలా  అప్రమత్తంగా  ఉండాలి.
ప్రభాత కిరణాల నమస్సులతో 🙏

కామెంట్‌లు
Popular posts
నిశ్శబ్ద కోరిక : - D.రసన్య,10వ తరగతి, తెలంగాణ మోడల్ స్కూల్, ఘన్పూర్ (స్టేషన్), జనగామ (జి)
చిత్రం
తల్లి గర్భము నుండి ధనము తేడెవ్వడు--ఎం బిందుమాధవి
చిత్రం
మహాభారతంలో వింత పేర్లు.డా.బెల్లంకొండనాగేశ్వరరావు. (నేడు సుబ్బారావు.శంకరరావు పేరు పలువురికి ఎలాఉన్నాయో నాటి కాలంలో కూడా ఒకే పేరు పలువురికి ఉండేది.పురాణలపట్ల ఆసక్తి, అవగాహన కోరుకునేవారికొరకు ఈవ్యాసం.) మహాభారతంలో రమారమి 1655 ప్రాత్రలు మనకు కనిపిస్తాయి. 'అజుడు'దశలధమహారాజు తండ్రి.మరో'అజుడు'పాండవులతరపున యుధ్ధంచేసినరాజు అతిరథుడు.(భీష్మపర్వం)అలాగే నలుగురు 'అనువిందులు'1.దుర్యోధనుని తమ్ముడు (ఆదిపర్వం) 2.సహాదేవుని దక్షణదిగ్విజయ యాత్రలో ఓడిన రాజు(సభాపర్వం) 3.కేకేయరాజు (భీష్మపర్వం)4.కౌరవల తరపున పోరాడిన అవంతీశ్వరుడు. (ఉద్యోగపర్వం)ముగ్గురు 'అలంబసులు' 1.జటాసురునికుమారుడు. (ద్రోణపర్వం)2.బకాసురునిసోదరుడు.(ద్రోణపర్వం) 3.ఒకరాజుయుద్ధంలో 14.రోజు సాత్యకిచేతిలోమరణించారు.(ద్రోణపర్వం)ఇద్దరు 'అశ్మీకుడు'లు 1అభిమన్యునిచేతిలో మరణించినకౌరవుడు(ద్రోణపర్వం) 2.ఇక్షాకు వంశరాజు,కల్మషపాదుని కుమారుడు.(ఆదిపర్వం)ఇద్దరు 'ఉగ్రశ్రవశుడు' 1.దుర్యోధనుని తమ్ముడు(ఆదిపర్వం) 2.వ్యాసమహర్షి శిష్యుడు. (ఆదిపర్వం)ఇద్దరు 'ఉగ్రసేనుడు'1.జనమజేయునితమ్ముడు(ఆది) 2.దుర్యోధనుని తమ్ముడు.(ఆది)ఇద్దరు 'ఉగ్రాయుధుడు' 1.పాంచాలకుమారుడు (కర్ణ) 2.దుర్యోధనునితమ్ముడు. (ఆది)ఇద్దరు 'ఉత్తరలు'1దక్షునికుమార్తే (ఆది) 2.వరాటమహారాజు కుమార్తె (విరాటపర్వం)ఇద్దరు 'బుచీకకులు'1.ఔర్యునికుమారుడు. (ఆది) 2.దేవాతిథి కుమారుడు.(ఆది)ఇద్దరు 'కపిల'1.కస్యపునిభార్య. (ఆది) 2.గోవు.(ఆది)ఇద్దరు 'కర్ణులు'1.కుంతికుమారుడు. (ఆది) 2.దుర్యోధనుని తమ్ముడు.(ఆది)ముగ్గురు 'గాంధారీలు'1.కౌరవులతల్లి.(ఆది) 2.అజమీఢుని కుమార్తె(ఆది) 3.కుమారస్వామి కొలువులో దేవాంగన (అరణ్య)ముగ్గురు'గోపతి'లు 1.తపుడు అను వహ్ని పుత్రుడు. (అరణ్య)2.మయసభకు వెళ్లిన ఋషి.(సభా) 3.శిబి మనవడు.(శాంతి )ముగ్గురు 'ఘృతాచి'లు.1.అప్సరస.(ఆది)2.ఛ్యవనుని కోడలు.(ఆది)3.కశ్యపునిభార్య. (ఆది)ముగ్గురు'చంద్రసేనుడు'లు 1.శల్యుని చక్రరథికుడు.(శల్య)2.ద్రౌపతి స్వయంవరంకి వచ్చినరాజు. (ఆది)3.భీముని దిగ్విజయ యాత్రలో ఓడినరాజు. (సభా)ముగ్గురు 'చిత్రుడు'లు 1.పాంచాలరాజు.2. చేధిరాజు.(కర్ణ)ఇద్దరు 'చిత్రరథులు'1.ద్రుపద సంజాతుడు అయిన వీరకేతుని పుత్రుడు. (ద్రోణ)2.రేణుకాదేవి కి నీళ్లవద్ద కనిపించిన వాడు.3.అంగరాజు. (అరణ్య)ముగ్గురు'చిత్రవర్మ'లు1.వీరకేతుని పుత్రుడు. (ద్రోణ) 2.దుర్యోధనుడి తమ్ముడు.(ఆది)3.విరూపాక్ష అంశంతో జన్మించినవాడు. (ఆది)నలుగురు'చిత్రసేనులు'1.కర్ణుని చేతిలో మరణించిన పాండవవీరుడు. (కర్ణ)2.ఘోషూయాత్రలో దుర్యోధనుని బంధించినవాడు.(అరణ్య)3.కర్ణ తనయుడు.నకులునిచేతిలో మరణించాడు.(శల్య)4.పాండవ వీరుడుశ్రుతకర్మ చేతిలోమరణించాడు. (కర్ణ)(మిగిలినవి మరో పర్యాయం.)
చిత్రం
తెలుగు సాహిత్యం-శివ కవులు-- బెహరా ఉమామహేశ్వరరావు--సెల్ నెంబర్: 9290061336.
చిత్రం
గంగిగోవు పాలు గరిటెడైనను చాలు: --ఎం బిందుమాధవి
చిత్రం