ఉచితం వద్దు.;- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు.
 పూర్వం అవంతి రాజ్యాన్ని వీరసింహుడు,చందన రాజ్యాన్ని చంద్రసేనుడు,మాళవ రాజ్యాన్ని గుణనిధి అనేవారు పరిపాలిస్తూ ఉండేవారు. అవంతి,మాళవ రాజ్య పాలకులు మాత్రం ప్రజలనుండి వసూలు చేసిన పన్నులను ప్రజల అవసరాలకు వినియోగపరుస్తూ పొదుపుగా ఉండేవారు. వారి కోశాగారాలు నిండుగా ఉండేవి.
అవంతి రాజకుమార్తెను మాళవ యువరాజుకి ఇచ్చి వివాహం జరిపించడంతో వారిమధ్య బంధుత్వంతో స్నేహం బలంగా ఉండేది.
చందనరాజ్య పాలకునికి కీర్తి కాంక్ష ఎక్కువ. తనరాజ్య ప్రజలవద్ద మెప్పుపొందడానికి వారికి అవసరం లేకున్నా విపరీతమైన ఉచిత పథకాలు ప్రకటిస్తూ విలాసవంతమైన జీవితం అనుభవిస్తూ ఉండేవాడు.చందన రాజ్య ప్రజలు తమరాజు ఇచ్చే ఉచితాలు అనుభవిస్తూ వ్యాపార, వ్యవసాయానికి అన్నివసతులు ఉన్నప్పటికి, శ్రమించడంలో సోమరితనానికి అలవాటు పడ్డారు. పలుమార్లు చందన రాజ్య కరువు బారినపడగా అవంతి,మాళవ రాజులు ఉచితంగా ఆదుకున్నారు.
తన అవసరాలకు ఇబ్బంది కలగడం ఖజానాలో ధనం లేక పోవడం, అప్పులు ఎక్కువకావడం,ప్రజలనుండి రాబడి(పన్నులు) లేక పోవడంతో వేరే మార్గంలేక,సంపన్నంగా ఉన్న అవంతి రాజ్యాపై దాడిచేసి స్వాధీనం చేసుకుంటే ధనం తోపాటు తన రాజ్యవిస్ధిర్ణత పెరుగుతుంది అనుకుని అవంతి రాజ్యంపైన దాడి చెసి స్వాధీన పరచుకోవాలని నిర్ణయించుకుని తన సేనలను సిధ్ధ పరచసాగాడు చందన రాజు.ఈవిషయం తెలుసుకున్న అవంతి రాజు,మాళవ దేశ రాజుతో రహస్యంగా వేగులద్వారా సందేశం పంపించి చందన రాజు అవంతి రాజ్యంపై దడెత్తి వచ్చినప్పుడు మాళవ రాజు ఏంచేయాలో చక్కటి  వ్యూహం పన్ని తనవేగుల ద్వారా తెలియజేసాడు.అందుకు సమ్మతించిన మాళవ రాజు వేగులద్వారా తన సమ్మతి తెలియజేసాడు.
చందన రాజు తన సర్వ సైన్యంతో అవంతిపైకి యుధ్ధనికి బయలు దేరుతూ కొద్దిపాటి సైనికులను తనరాజ్యరక్షణకు ఉంచి,అవంతి రాజ్యంపై యుధ్ధానికి వెళ్ళాడు.అదేసమయంలో మాళవరాజు చందన రాజ్యాన్ని ఆక్రమించాడు.అక్కడ యుధ్ధంలో అవంతి సైనికులే కాకుండా దేశప్రజలు ఆయుధాలు ధరించి చందనసైనికులను తరిమి తరిమి కొట్టారు.ఓడిన చందనరాజు తనరాజ్యం కూడా కోల్పోయానని గ్రహించాడు.
అనంతరం చందన రాజ్యాన్ని అవంతి,మాళవ రాజులు చెరిసగం పంచుకున్నారు.
యుధ్ధంలో ఓడిన చందనరాజు ఉన్న రాజ్యాన్ని చేజార్చుకుని అడవులపాలై తన దురాశే తనకు ఈదుర్గతి తెచ్చిపెట్టిందని తనూ,తన రాజ్యప్రజలు అన్నిరంగాలలో శ్రమించి ఉంటే బాగుండేదని ఉచిత పధకాల ద్వారా తను గొప్పవాడిని అనిపించుకోవడానికి,తనకీర్తి ప్రతిష్టలు పెంచుకోవడానికి తన ప్రజలను సోమరులుగా తయారుచేసానని ఇతరుల సొమ్ముకు ఆశపడితే ఉన్నది పోయిందని చింతించాడు.

 


కామెంట్‌లు