సుందర స్వప్నం ;- వసుంధర వెంకట్ నల్ల- నుస్తులాపూర్

 నిన్నే తపిస్తూ నీ నామం
 జపిస్తూ
 నిద్దుర దేవి ఒడిలో
 నిద్రించుచుండగా
 నీ అందమైన సుందర
 మోముతో  నా ముందు
 నిలిచి
 నీ కవితాలహరితో నను 
 మేల్కొలిపినావు
 వాస్తవమనుకొని నేను
 జలపాతపు దూకుడు
 లాంటి ఆనందంలో
 మునిగి పారవశ్యం
 చెందాను.
స్వప్నమని తెలిసి ఇది
 కలయా అని అనుకొని
 చిరునవ్వు చిందిస్తూ
 కన్నులు మూసి పక్కకు
 తిరిగి పడుకో పోతుంటే
 నీ సుందరమోముతో మళ్లీ
 నా ముందు  నిలిచావు.
 నిరతం నిన్నే చూస్తూ
 కూర్చుండాలనుంది ప్రియా
 కానీ కనులు తెరిచిన
 మరుక్షణం నీ అందమైన
 ముఖారవిందంతో సహా
 నీవు అదృశ్యం
 అవుతున్నావు
ఆవేళ ఏమి చేయాలో
 తెలియక అలాగే వెల్లకిల
 పరుండి  మళ్లీ కన్నులు
 మూసి నీ అందమైన
 సుందర మోమును
 తిలకిస్తూ నిద్రా దేవి
 ఆహ్వానిస్తుంటే ఆమె
 ఒడిలో గువ్వలా
 ఒదిగిపోయాను.
కామెంట్‌లు