మా కన్నయ్య
మాకు అన్నయ్య
శ్రీనివాస్ గౌడ్ అన్నయ్య!!
ఏ సమస్య అయినా
ఏ గండమైనా
ఏ పండగ అయినా
మాకు అండ మాకు గుండె
శ్రీనివాస్ గౌడ్ అన్నయ్య!!!
మాకు రెండు కళ్ళు
ఆదుకునే రెండు చేతులు
కార్చే కన్నీరు తుడిచి ఓదార్చే
దయగల దేవుడు
శ్రీనివాస్ గౌడ్ అన్నయ్య!!
ఆకలి తీర్చే అన్నదాన సత్రం
అన్యాయాన్ని ఎదిరించే
ధర్మం చేసే ధర్మ సత్రం
అనాధలను ఆదుకునే అన్నయ్య
మా శ్రీనివాస్ గౌడ్ అన్నయ్య!!
ఊళ్లో గుళ్ళు
చెరువులో నీళ్లు
చదువుకునే బళ్ళు
ఆరోగ్య ఆలయాలు ఆయన ఇల్లు!!!
పేదవానికి పెదవు
అమాయకులకు నాలుక
అల్పులకు ఇలవేల్పు
మా శ్రీనివాస్ గౌడ్ అన్నయ్య!!
గడపగడపకు
పసుపు కుంకుమ
దర్వాజకు
ఆకుపచ్చ తోరణం
వాకిట్లో ముత్యాలముగ్గు
మా శ్రీనివాస్ గౌడ్ అన్నయ్య!!!
ఆడపడుచులకు
అరుంధతి నక్షత్రం
స్త్రీలకు చీరా సారే
పసి పిల్లలకు ఊగే ఉయ్యాల
మా శ్రీనివాస్ గౌడ్ అన్నయ్య!!!
ఊరే ఆయనకు ఊపిరి
జనమే ఆయనకు బృందావనం
యువకులే ఆయనకు సైనికులు
పాలెమే ఆయనకు దేవాలయం!!!
పాలెం శ్రీనివాస్ గౌడ్ అన్నయ్య కు చిరుకానుక

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి