సైకత శిల్పం.-సైకత శిల్పి- తాటి కోల పద్మావతి గుంటూరు.
శిలలను శిల్పాలుగా నిర్మిస్తూనే ఉంటాడు.
అవి అందంగా రూపుదిద్దుకొని సజీవ శిల్పాలుగా కనిపిస్తుంటాయి.
గాలికి నేటికీ కొట్టుకుపోతాయని భయం లేదు.
శిల్పి తన నైపుణ్యాన్ని ప్రదర్శిస్తూనే ఉంటాడు.
సృష్టి నశించిపోతుందని తెలిసిన విధాత సృష్టిస్తూనే ఉంటాడు.
మనిషి జీవితం ఎప్పటికైనా కనుమరుగవుతుందని తెలిసినా,
మానవుడు తాపత్రయం పడుతూనే ఉంటాడు.
అదే ఆశ సైకత శిల్పి
శిల్పాలన ఆవిష్కరిస్తూ ఆనంద పడుతుంటాడు.
తొక్కితే రాయి, మొక్కితే దేవుడు.
ఎన్నో బండరాళ్లను విగ్రహాలుగా చెప్పి గుడిలో నిలబెడతాడు.
ఎంతోమంది నాయకులను శిల్పి తన నైపుణ్యాన్ని ప్రదర్శించుకుంటాడు.
రాతి వంటి శిలలో రాగాలు పలికిస్తాడు.
కఠిన రాతి గుండెల్లో అమృతాన్ని కురిపిస్తాడు.
ఏ బండల చాటున దాగి ఉన్న అందాలను వెలికి తీసి అద్భుతాలను సృష్టిస్తాడు.
దేవాలయాల మీద ముక్కోటి దేవతల స్వరూపాలను అందంగా తీర్చిదిద్దుతాడు.
అందమైన తాజ్ మహల్, చార్మినార్, గోల్కొండ, 
మక్కా మసీదు లాంటి అద్భుత కట్టడాలకు శిల్పి ప్రాణం పోస్తాడు.
శీల లో దాగిన అందాలను ప్రపంచానికి చాటాలని ఆరాటపడతాడు.
శిల్పి కి అందాలను సృష్టించడమే అతని చేతి కళ.
శిలలపై శిల్పాలను చెక్కి
మనవాళ్లు అందాలను తెచ్చిపెట్టారు.
శిలకి శిల్పి కి అవినాభావ సంబంధం విడదీయరానిది.
శిల్పి చేతిలో మలచిన శిల
తరతరాల యుగయుగాల చరిత్రను చాటి చెప్తుంది.
రాజులు రాణులు, చరిత్రకారులు
, దేశ నాయకులు, అమరవీరుల వంటి
 శిల్పాలు చెక్కిన శిల్పులు
జాతికే వన్నెతెచ్చిన శిల్పకారులు.


కామెంట్‌లు