నీది ఆస్తికత్వమా....
నాస్తికత్వమా....
విబేధాలుచూడని
మానవత్వము.... !
*****
సరిగ్గా అర్ధం చేసుకోరు
వాదోపవాదాలు.... !
ఇజాలతో...
కు విమర్శలు... !!
*****
ఆస్తికులు - నాస్తికులు
పిడివాదాలు.... !
లోపాలు చూడరు
సత్యం మరుగే గా ... !!
*****
వాదాలన్నీ...
ఉదాత్తమైనవే... !
మనుషులే...మూర్ఖులై
కొట్టుకు చస్తున్నారు !!
*****
ఆస్తికు లైనా ....
నాస్తికు లైనా
ఎవరైనా కానీ...
మూర్ఖులు కాకుంటే చాలు!
******

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి