పరివర్తన!అచ్యుతుని రాజ్యశ్రీ

 తాత భోజనం ఐనాక పిల్లలతో కాసేపు పిచ్చాపాటి మాట్లాడి ఓప్రశ్న అడిగాడు "గాంధీ తాత కి ఇష్టమైన బొమ్మలు ఏవి?" "మూడు కోతులు!" "సెభాష్!అవి ఎవరిచ్చారో తెలుసా?""ఉహు!" "మూడు కోతుల బొమ్మలు చెడు వినకు కనకు మాట్లాడకు అని బోధిస్తాయి.సబర్మతీ ఆశ్రమం కి వచ్చిన  చైనాయాత్రికులు బాపూజీకి బహూకరించారు.ఇప్పటికి అక్కడ గాంధీజీ బల్లపై మనం చూస్తాం.ఇక కథ చెప్తా వినండి. మిత్రుడు శత్రువు ని  సమానంగా గా చూడాలి అని ఓసాధువు అందరికీ చెప్పేవాడు. కుక్క కాటుకి చెప్పుదెబ్బ అంటించాల్సిందే అని అన్నారు కొందరు.  కానీ ఓకోపిష్టి సాధువుపై తాడెత్తున ఎగిరి ఆయన్ని కిందకి తోశాడు.మిగతా వారు  ఆకోపిష్టి పై చేయి చేసుకున్నారు.  సాధువు అన్నాడు " అతని కోపం కసి తీరింది. కొట్టకండి.అరే బాబూ! నీమనసు నల్లమబ్బు.బడబడా వాన కురిసింది. నీమనసు చల్లబడింది కదూ?" అంతే వాడుభోరుమని ఏడ్చి శిష్యుడి గామారాడు.ఇదే పరివర్తన. భయంకాదు.భక్తి ఆర్తి ముఖ్యం " తాత మాటలకు అంతా తలలు తాటించారు🌹
కామెంట్‌లు