ముఖ్య అతిథులుగా తెలుగు తిరుమలేష్ ,ఆసియా రియాజ్
నేడు వనపర్తి జిల్లా ఆత్మకూరు మండలంలోని ఎం.వి.రామన్ పాఠశాల అకాడమిక్ అడ్వైజర్ రచయిత డాక్టర్ రాములు సార్ గారు రచించిన కవితా వాణి పుస్తకావిష్కరణ ఆత్మకూరులో జరిగినది.ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా తెలంగాణ రచయితల సంఘం జిల్లా అధ్యక్షులు తెలుగు తిరుమలేష్ గారు,ప్రముఖ వక్త ఆసియా రియాజ్ మరియు రచయితలు కోలంట్ల రామకృష్ణ, అమీర్ బాషా మరియు ఉపాధ్యాయులు రాధ,జ్యోతి,దీప్తి,భాగ్యలక్ష్మి,ఆసియా,రియాజ్, రుబీయా , అసిఫా, నాజియా,నవనీత, సుధారాణి, అయేషా, వెంకట్,పరమేష్,వెంకటేష్ , కార్తిక్,సీతారాములు తదితర ఉపాధ్యాయ బృందం పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ప్రముఖ రచయిత,తెలంగాణ రచయితల సంఘం జిల్లా అధ్యక్షులు తెలుగు తిరుమలేష్ గారు మాట్లాడుతూ బహు గ్రంథ రచయిత,కవి డాక్టర్ రాములు సార్ గారు.విశ్రాంతి సమయంలో కూడా వారు విరామమెరుగని సాహితీ మూర్తులు డాక్టర్ రాములు గారు. వారు ఎక్కడ ఉంటారో అక్కడ సాహిత్యం,సామరస్యం వెల్లివిరుస్తుంది. సాహిత్యమును ప్రవృత్తిగా మార్చుకున్నా గొప్ప చరిత్ర పరిశోధకులు. ఎంతో మంది విద్యార్థుల హృదయాలలో వారి రచనలు వారి విద్యాబోధన స్థిరంగా నిలిచి మరెందరికో ఆదర్శంగా నిలిచాయి.గతంలో ఎన్నో పుస్తకాలు ముద్రించి పాఠకులకు అందించారు. కానీ నేడు వచన కవిత్వంలో తన జీవితానుభవాలను జోడించి వచన కవితా పుస్తకాలలో భాగంగా కవితా వాణి అనే కవితా సంపుటి పుస్తకాన్ని రచించారు.
ఈ కవితా వాణి అనే కవితా సంపుటి సకల శుభ వాణిగా,అందులోని కవితలు అక్షరామృతధారగా మారి,కవి కవితా సాగరంలో మెరిసిన ఆణిముత్యం ఈ కవితా వాణి అని తెలుపుతూ,వారి కవితా వాణి పుస్తకానికి స్వాగతం పలుకుతూ,రచయిత డాక్టర్ రాములు సార్ గారికి ప్రత్యేక అభినందనలు తెలియజేసుకుంటున్నాము అని వారు తెలియజేశారు.


addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి