కడలి కడుపులో దాచిన
రహస్యాలెన్నో...రత్నాలెన్నో?
మన మనసులో దాచిన
కలతలెన్నో...మమతలెన్నో?
అంతు తెలియని ఆరాటాలే
ఆగక పరుగులు తీసే కెరటాలు
ఉవ్వెత్తున ఎగసే అలలే
ఉత్సాహాలు...ఆవేశాలు.
ఎంత ఎత్తుకు అలలు ఎగిసినా
నింగిని చేరని నీలపు సంద్రం
ఎంత దూరం పరుగు తీసినా
తీరాన నిలవని నీటి జోరు
కాలానికి కరుణ లేదు
సమయానికి సహనం లేదు
పైకి కనిపించేదే కాదు జీవితం
అంతరంగ తరంగాల అగాధం
చుట్టూ ఉన్న చిన్ని అందాలు
చూసే తీరిక లేక
ఆవరించిన చిన్న ఆనందాలు
ఆస్వాదించే అవకాశంలేక
మనసును మరగా మార్చిన
ఉరుకులు..పరుగులు
తీరిగ్గా వెనుకకు చూస్తే
తీరని చిన్ని ఆరాటాలు..
జీవితం చిన్నది.....
జీవిస్తూ ఆనందించాలి
చిన్ని ఆనందాలు పెద్ద మూటగా
పోగేసుకోవాలి
మరో మధురమైన ఉదయానికి
🌸🌸 సుప్రభాతం 🌸🌸
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి