వేకువనే
లేస్తా
ఆలోచనలను
పారిస్తా
కలలు
కంటా
కవితలలో
పెడతా
కలమును
పడతా
కాగితాలను
నింపుతా
సూర్యోదయం
చూస్తా
కవితోదయం
చేస్తా
ఊహించి
వ్రాస్తా
భావకవిత
అంటా
ప్రేమకవితలు
పుటలకెక్కిస్తా
ప్రణయకవితలని
పేరుపెట్టేస్తా
అక్షరాలను
అమరుస్తా
అర్ధాలను
అంటకడతా
ప్రాసలతో
పండిస్తా
లయతో
నడిపిస్తా
కవిసమ్మేళనాలలో
పాల్గొంటా
కవితలను
పఠించుతా
చప్పట్లుకొడితే
సంతోషిస్తా
ముచ్చట్లుచెబితే
మురిసిపోతా
శాలువాలు
కప్పించుకుంటా
సన్మానాలు
చేయించుకుంటా
ప్రశంసాపత్రాలు
పుచ్చుకుంటా
పొగడ్తలకు
పొంగిపోతా
ఫోటోలు
తీసుకుంటా
వీడియోలు
దాచుకుంటా
పత్రికలలో
వేయించుకుంటా
పలువురిదృష్టిని
ఆకర్షిస్తా
పోటీలలో
పాల్గొంటా
పతకాలు
కొల్లగొడతా
విజేతగా
నిలుస్తా
నగదుబహుమతులు
కొట్టేస్తా
కమ్మగాకైతలు
వినిపిస్తా
కర్ణాలకు
విందునిస్తా
చదివితే
సంబరపడతా
శ్లాఘిస్తే
సంతృప్తిపొందుతా
పుస్తకాలను
ప్రచురిస్తా
సాహిత్యలోకానికి
అందజేస్తా
కవివంటే
పొంగిపోతా
కాలరును
ఎగరేస్తా
బిరుదులిస్తే
పుచ్చుకుంటా
పేరుముందు
తగిలించుకుంటా
సరుకుంటే
సాగిస్తా
సమూహాలలో
సాక్షాత్కరిస్తా
సుదీర్ఘపయనం
చేస్తా
సాహిత్యలోకాన
స్థిరపడతా
=====================
పాతకవులకు
ప్రణామాలు
వర్తమానకవులకు
వందనాలు
సుకవులకు
స్వాగతాలు
మహాకవులకు
మల్లెపూదండలు
కొత్తకవులకు
కోటిదీవెనలు
కవియిత్రులకు
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి