కృషి!అచ్యుతుని రాజ్యశ్రీ

 బడికి సెలవలు ఇచ్చారు కదా? 9దాకా మంచం దిగని పిల్లలని ఆమర్నాడు తాత 6కేలేపాడు."అబ్బబ్బ!సెలవలు" "రాత్రి 9కి పడక 6కి లేచి తోటపని చెయ్యాల్సిందే!" తాత గదమాయింపుతో తప్పదురా దేవుడా అని లేచి గబగబా కాలకృత్యాలు తీర్చుకున్నారు.అందరినీ పార్క్ గుడికి తీసుకుని వెళ్లి  "గొప్పులు తవ్వండి" అన్నాడు. "తాతా! లోపలంతా రాళ్ళు  ఇసుక". "రోజు కాస్త తవ్వి గుడిలో ఆవుపేడ చెత్త చెదారంతో గుంటలు నింపండి.వర్షాలు పడగానే విత్తులు చల్లాలి.చూడండి పిల్లలూ! మనం బాల్యం నించి అన్నీ నేర్చుకోవాలి. అప్పుడు మీలక్ష్యం చేరొచ్చు. పుస్తకాలు చదివితే  ఓరచయిత కావచ్చు. పేపర్ చదివి రోజు విశేషాలు తెలుసుకుని  ఇతరులకు చెప్పాలి.ఓరచయిత కథరాయటం మొదలు పెట్టి సగంరాసి చెత్త బుట్టలో పారేశాడు.అలాబైటికెళ్లాడు.కూలీలు బిల్డింగ్ కూలగొడుతున్నారు.బావి తవ్వకం సాగిస్తున్నారు. ఆరోజుల్లో మిషన్లులేవు.వెంటనే ఆరచయిత ఇంటికొచ్చి  చెత్త బుట్టలో పడేసిన తనకథని రోజు కాస్త రాస్తూ ఓనవలరాసి ప్రింట్ చేయించాడు.అది 30లక్షలకాపీలు అమ్ముడైనాయి.అంతే డాక్టర్ ఎ.జె.క్రోనిన్ అనే ఆస్కాటిష్ రచయిత  వైద్యవృత్తి మానేసి రచయిత గా ఎదిగాడు.కృషి పట్టుదలతో మీరు ఏపనైనా ఈసెలవుల్లో చేసి సాధించాలి. " అంతా "అలాగే తాతా!" అని కేరింతలు కొట్టారు 🌹
కామెంట్‌లు