పల్లవి :-
పంచభూతములె, ఐదు ముఖములుగ అవతరించె నిలగాయత్రి మాతగ........2
ముగ్గురమ్మలతో ఆదిశక్తి తను ప్రక్రుతి కాంతను వెంటనిడుకునీ జగతికి శుభములు చేకూర్చగా ఇలపై వెలిసెను....2 పంచముఖ గాయత్రిగా..... !
"పంచభూతములె... "
చరణం :-
శ్రీ మహా లక్ష్మిగ సిరుల నొసగునది తానే.... !
, విద్యాబుద్ధుల నొసగే ఆ శ్రీలక్ష్మి కోడలు సరస్వతియూ తానే..... !
పరమశివుని అర్ధభాగము పార్వతియూ తానే..... !
ఈ ముగురమ్మల మూలమూర్తి ఆ ఆదిశక్తియూ తానే.... ! ఈ ప్రాణికోటి కాధారమైన ప్రక్రుతి కాంతమూ తానే.... !!
సమస్త శక్తుల సమగ్రరూపం సర్వేశ్వరివీ నీవమ్మా.... మము కరుణతొ చల్లగ చూడమ్మా... 3...!
*******

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి